నీట్‌ వ్యవహారంపై రంగంలోకి సీబీఐ

నీట్‌ నిర్వహణలో అవకతవకలపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని కేంద్రం ఆదేశించడంతో సీబీఐ రంగంలోకి దిగింది.

నీట్‌ వ్యవహారంపై రంగంలోకి సీబీఐ
X

నీట్‌ యూజీ పేపర్‌ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఏ డైరెక్టర్‌ సుబోధ్‌ సింగ్‌కు ఉద్వాసన పలికింది. నీట్‌లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. తాజాగా నీట్‌ నిర్వహణలో అవకతవకలపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని కేంద్రం ఆదేశించడంతో సీబీఐ రంగంలోకి దిగింది.

Also Read - రేపటి నుంచి లోక్‌సభ సమావేశాలు

ఇప్పటికే యూజీసీ-నెట్‌ లీక్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ విచారణను వేగవంతం చేసింది. నీట్‌ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారించనున్నది. అలాగే బీహార్‌లో పేపర్‌ లీక్‌, పలుచోట్ల విద్యార్థులు సమయం కోల్పోయారంటూ వారికి గ్రేస్‌ మార్కులు కలపడం వంటి అంశాలపైనా సమగ్రంగా విచారించనున్నది. కేంద్ర విద్యాశాఖ సూచనల మేరకు నమోదు చేసిన ఈ కేసు కేసును విచారించడానికి రంగంలోకి దిగిన సీబీఐ బృందం బీహార్‌లో 6 మందిని అరెస్టు చేసింది. వాళ్ల నుంచి సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నది.గుజరాత్, బీహార్‌లో పోలీసులు నమోదు చేసిన ఈ కేసుల దర్యాప్తును కూడా సీబీఐ చేపట్టాలని యోచిస్తున్నట్టు సమాచారం

Raju

Raju

Writer
    Next Story