సీడీపీవో పరీక్షల రద్దు
చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ (సీడీపీవో), ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్ (ఈవో) ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.
- By RajuLoading...
- | 19 July 2024 3:10 PM GMT
X
X
మహిళ, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ (సీడీపీవో), ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్ (ఈవో) ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ పరీక్షల ప్రశ్నపత్రాలపై సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (సీఎఫ్ ఎస్ ఎల్), స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటీ) నివేదికల ఆధారంగా చర్చించిన కమిషన్ ఈ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామన్నది త్వరలో ప్రకటిస్తామని సర్వీస్ కమిషన్ తెలిపింది.
Raju
Writer
Next Story