గులాబీ బాస్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం

బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం ప్రారంభ‌మైంది. తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు.

KCR
X

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గులాబీ బాస్ దిశానిర్ధేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు, పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగ సమస్యలు, రుణమాఫీ తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చకు పెట్టాలని ప్రభుత్వం ముందు ఉంచనుంది బీఆర్ఎస్ పార్టీ.

దాదాపు 10 కీలకమైన అంశాలను చర్చించడానికి పట్టుబట్టాలని ఒత్తిడి తీసుకురానున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలు అమలు చేసే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నది. ప్రతిపక్షంలో ఉండగా ఆయా వర్గాలను మభ్యపెట్టి, అధికారంలోకి రాగానే అన్నింటినీ అమలు చేస్తామని అలవికాని హమీలు ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేస్తున్న కాంగ్రెస్‌పై తీరును ఎండగట్టాలని నిర్ణయించింది.

Vamshi

Vamshi

Writer
    Next Story