భవిష్యత్తు బీఆర్‌ఎస్‌దే! : కేసీఆర్‌

తనను కలిసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు పార్టీ అధినేత కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. ఒకరిద్దరు పార్టీ వీడినంత మాత్రనా నష్టమేమీ లేదని భవిష్యత్తులో మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందన్నారు.

భవిష్యత్తు బీఆర్‌ఎస్‌దే! : కేసీఆర్‌
X

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్సే గెలుస్తుందని, మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ వీడినంత మాత్రానా పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని, ఎవరూ తొందర పడవద్దని, భవిష్యత్తు మనదేనని తనను కలిసిన ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. గతంలో మహారాష్ట్రలో జరిగిన పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, మూడు నెలల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన విషయాన్ని కేసీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు చేసి మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. మహారాష్ట్ర కేసులో ఏ న్యాయవాదులైతే వాదించారో వారినే బీఆర్‌స్‌ తరఫున వాదించడానికి ఎంచుకోవాలని నిర్ణయించినట్టు కేసీఆర్‌ తెలిపారు.





బీఆర్‌ఎస్‌ అధినేత వారం రోజులుగా ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ చైర్మన్లు తదితర ముఖ్యనేతలు, పలు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు నిత్యం సమావేశమౌతూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అధినేత కేసీఆర్ ను కలిసి మర్యాదపూర్వకంగా సమావేశమైన వారిలో…సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు, బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,జమగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, వనపర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్,ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ,మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పార్టీ ముఖ్యనేతలు రాగిడి లక్ష్మారెడ్డి, సుధీర్ బాబు, కల్లుగీత కార్పోరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి గౌడ్, మాజీ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రజినీ సాయిచంద్,తదితర నియోజకవర్గాల ముఖ్యనేతలు..ఆయా జిల్లాల స్థానిక నాయకులు ఉన్నారు.





ఈ నేపథ్యంలో బుధవారం నాడు జనసందోహంతో ఎర్రవెల్లి పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు మారు మోగాయి. కేసీఆర్ నివాసం అభిమానుల తాకిడి తో కిక్కిరిసిపోయింది. తమ అభిమాన నేతను చూడటానికి వచ్చిన ప్రతి కార్యకర్తను, అభిమానులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం పలు నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు నాయకులతో వారి అభ్యర్థన మేరకు పార్టీ అధినేత కేసీఆర్ ఫొటోలు దిగారు. తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలు, నాయకులను ఆప్యాయంగా పలకరించారు.

Raju

Raju

Writer
    Next Story