బూతులకు బ్రాండ్‌ అంబాసిడర్‌

ఎన్నికల హామీలపై విపక్షాలు ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి బూతులు అందుకుంటున్నారు.

బూతులకు బ్రాండ్‌ అంబాసిడర్‌
X

నీ వెనక ఉన్న అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండే గతి అని మహిళా ఎమ్మెల్యేలపై సీఎం తన స్థాయిని మరిచి వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్‌లో ఉండే మహిళా నేతలు స్పందించలేదు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ మహిళా నేతను ఉద్దేశించి పండపెట్టి తొక్కి అయినా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాననని అడ్డగోలుగా మాట్లాడినా కాంగ్రెస్‌లో ఉండే మహిళకు ఆ వ్యాఖ్యలు తప్పుగా అనిపించలేదు. వినిపించలేదు. కానీ కేటీఆర్‌ ఆర్టీసీ బస్సుల్లో జరుగుతున్న పరిణామాలు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మంత్రి సీతక్కకు తప్పుగా అనిపించింది. మహిళలను కించపరిచేలా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. బీఆర్‌ఎస్‌ నేతలెవరూ సీఎం రేవంత్‌ వలె నోటికి ఏది వస్తే అది మాట్లాడలేదు. ఒకవేళ యథాలాపనగా ఏమైనా వ్యాఖ్యలు చేసినా వెంటనే క్షమాపణలు కోరారు. ఆ సంస్కారం ముఖ్యమంత్రికి కూడా ఉండాలి కదా!

నిన్న సీతారామ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత వైరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడిన మాటలు చూస్తే ఊసరవెళ్లి కూడా సిగ్గుపడేలా ఉన్నాయి. ఆయన మాటల్లో ఆవేశం తప్పా సబ్జెక్టు లేదు ఆబ్జెక్టూ లేదు. ఎంతసేపూ తన సీటు ఎవరో గుంజుకుంటారు అన్నట్టే ఆగమాగం ఏది పడితే అది మాట్లాడటం ముఖ్యమంత్రికి పరిపాటిగా మారింది. ఇది ఇవాళ కొత్తగా కాదు. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుద్దపూస మాటలు మాట్లాడారు. ఇక నుంచి తన నుంచి పరుష పదజాలం ఆశించవద్దని మీడియా వారికి చెప్పారు. ఆ మాటకు కట్టుబడి ఉన్నారా అంటే అదీ లేదు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓ మీడియా ఛానల్‌ ప్రశ్నించిన వారిపై మిమ్మల్ని లోపల వేస్తే అంతా సర్దుకుంటుంది అన్నారు. చంద్రబాబును మీ గురువు అంటే ముడ్డిమీద తంతా మళ్లా అలా ఒక్కసారి అంటే అని వ్యాఖ్యానించారు. త్వరిత గతిన ఖమ్మం జిల్లా రైతులకు గోదావరి జలాలు అందించాలనే సంకల్పంలతో కేసీఆర్‌ సీతారామా ప్రాజెక్టుకు రూపకల్పన చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకొచ్చి, ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించారు. అందుకే ఇవాళ సీఎం రేవంత్‌ రెడ్డి పైసా పనిచేయకున్నా స్విచ్‌ ఆన్‌ చేసే అవకాశం వచ్చింది. దీనికి తానేదో సాధించినట్టు, తనేదో ఈ తొమ్మిది నెల్లలో కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్టు వైరా సభలో పూనకాలతో సీఎం ఊగిపోయారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌పై తిట్ల పురాణం అందుకున్నారు.

విషయం లేనివాడు వితండవాదం చేస్తాడు. సబ్జెక్టు లేనివాడు బూతులు తిడతాడు అన్నట్టు సీఎం రేవంత్‌ కొన్నినెలలుగా తాను పాల్గొన్న కార్యక్రమానికి , అక్కడి విషయాలతో సంబంధం లేకుండా బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడాలి. అర్జెంటుగా ఆపార్టీని, ఆ పార్టీ అధినేతను, కేటీఆర్‌, హరీశ్‌లను రాజకీయంగా కనుమరుగు చేయాలి అన్న ధోరణిలో ముఖ్యమంత్రి మాట్లాడుతుంటారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా పూర్తిచేయకుండా తొమ్మిది నెలలుగా టైంపాస్‌ చేస్తూ.. అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తున్న ముఖ్యమంత్రి బూతుల్లో తెలంగాణకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారుతున్నారనే విమర్శలు వెలువడుతున్నాయి.

Raju

Raju

Writer
    Next Story