బాక్సాఫీస్ రికార్డు కలెక్షన్స్.. రూ.500 కోట్లు రికార్డు దాటేసిన కల్కి మూవీ

ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదలయిన కల్కి 2898 ఏడీ మూవీ కలెక్షన్లలో ప్రభంజనం సృష్టిస్తోంది.

Kalki movie
X

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా కలెక్షన్లలో రికార్డు వసూల్ సాధించింది. రూ.500 కోట్లు రికార్డును దాటేసింది. ఈ మూవీ మొదటి వారంలో ఉత్తర అమెరికాలో రూ.91 కోట్లు రాబట్టింది. దీంతో అత్యధిక వసూలు సాధించిన భారతీయ చిత్రంగా కల్కి నిలిచింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణె తదితర నటీనటులతో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ మేరకు మూవీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పోస్టు చేసింది.

వీకెండ్ కావడంతో ఎక్కడ చూసినా సినిమా హాళ్లు, థియేటర్లు హౌస్‌ఫల్‌యే కనిపిస్తుంది. దీంతో కల్కి సినిమా వసూళ్లపై ప్రభాస్‌ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరోవైపు ఈ సినిమాలో పురాణాలను భాగం చేయడంతో కర్ణుడికి సంబంధించి చరిత్ర విశేషాల వీడియోలు, రీల్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌వుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం పస్ట్ డే రూ. 66 కోట్ల రూపాయలు, రెండో రోజు రూ. 29 కోట్ల రూపాయలు, మూడో రోజు 31 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

అంటే ఈ చిత్రం మూడు రోజుల్లోనే 121 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 180 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది. హిందీలో కలెక్షన్లు ఇక హిందీలో తొలి రోజు 23 కోట్లు, రెండో రోజు 23 కోట్లు, మూడో రోజు 26 కోట్ల రూాపయలును వసూలు చేసింది. దాంతో మూడు రోజుల్లో 72 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక తమిళంలో తొలి రోజు 5 కోట్ల రూపాయలు, రెండో రోజు 3.5 కోట్లు, మూడో రోజు 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 13.5 కోట్లు వసూలు చేసింది. కల్కి పార్ట్ 2 మాత్రమే కాకుండా సినిమాటిక్ యూనివర్స్ ఉంటుందని చిత్ర టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పైగా పార్ట్ 1ను అద్భుతమైన రీతిలో ఎండ్ చేయడంతో పార్ట్ 2 గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు 2026 వేసవిలో ఇది విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు టాక్.

Vamshi

Vamshi

Writer
    Next Story