ఆదాయం కోసమే బొగ్గు గనులను వేలం వేయడం లేదు : కిషన్‌రెడ్డి

సింగరేణి సంస్థ బతకాలంటే కొత్తగా గనులు కేటాయించటం అవసరమని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన సత్తుపల్లి, కొయ్యగూడెం బ్లాక్ లను సింగరేణికి కేటాయించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

DY CM Bhatti
X

సింగరేణిని మరింత పటిష్టం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లెవనెత్తిన అంశాలపై ప్రధాని మోదీతో మాట్లాడతానని తెలిపారు. ఆదాయం కోసం మాత్రమే బొగ్గు గనులు వేలం వేయడం లేదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకోని యాక్షన్ చేపట్టినట్లు తెలిపారు.సింగరేణి కార్మికులు ఆందోళన చెందకూడదని కోరుతున్నా. వేలంపాట వల్ల రాష్ట్రాలకే ఆదాయం వస్తుంది తప్ప కేంద్రానికి కాదు’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌లో సింగరేణి లాభం పొందేలా ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. త్వరలో ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడుతామని చెప్పారు. బొగ్గు గనులు కావాలంటే అన్ని సంస్థలకు ఒకే విధానం ఉందన్నారు.

సింగరేణిని అదుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. ఆ సంస్థలో కొన్ని సమస్యలున్నాయి. వాటిని తప్పకుండా పరిష్కరిస్తాం. దిల్లీ వెళ్లాక దీనిపై అధ్యయనం చేస్తా. సింగరేణి విషయంలో బొగ్గుగనుల శాఖ అధికారులకు పూర్తి అవగాహన ఉంది. ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయకూడదని కోరుతున్నా. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడం సరికాదాన్నారు.గత సంవత్సరం వేలంలో పాల్గొని గనులు సాధించాల్సిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణికి నూతన బొగ్గు గనులు కేటాయించాలని కోరారు. సత్తుపల్లిలో 3, కొయ్యగూడెంలో 3 బొగ్గు గనులు ఉన్నాయన్నారు. ఆరింటిని కేటాయిస్తే సింగరేణికి అనువుగా ఉంటుందని తెలిపారు. బొగ్గు గనుల కోసం ప్రధానిని.. కిషన్‌రెడ్డి ఒప్పించాలన్నారు.




తాను, సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రధానితో మాట్లాడేందుకు వస్తామన్నారు. సింగరేణికి వేలంలో రిజర్వేషన్‌ కల్పించాలని కోరారు. అనంతరం సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కోరిన అంశాలపై ప్రధాని మోదీతో చర్చస్తామని కిషన్‌రెడ్డి అన్నారు.కొత్త చట్టంలోని రిజర్వేషన్ పద్ధతి ప్రకారం సింగరేణికి కొత్త గనులు కేటాయించే అవకాశం ఉంది. ఈ సెక్షన్ ప్రకారం తమకు అతి ముఖ్యమైన నాలుగు బొగ్గు బ్లాక్లు కేటాయించాలని సింగరేణి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను కోరింది. వాటిలో సత్తుపల్లి బ్లాక్ -3, కోయగూడెం బ్లాక్ 3, శ్రావణపల్లి బ్లాకు, పీకే ఓసి డిప్ సైడ్ బ్లాక్ లు ఉన్నాయి.

Vamshi

Vamshi

Writer
    Next Story