రైలు ప్రమాదంపై స్పందించిన అశ్విని వైష్ణవ్ ..ఐదుకు చేరిన మృతుల సంఖ్య

దేశంలో వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.అసలు ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి. టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది కాదా? అయినా ఈ ఘోర రైలు ప్రమాదాలకు కారణం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి.

train accident
X

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ప్రమాద ప్రాంతంలో యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్​ బృందాలు సమన్వయంతో పని చేస్తున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. దేశంలో వరుస రైలు ప్రమాదలు జరుగుతున్నాయి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కవచ్ టెక్నాలజీ ఏమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్న టెక్నాలజీ ఎందుకు పని చేయడం లేదని ప్రశ్నలు తలెత్తున్నాయి. అసలు కవచ్ కేవలం నామాత్రంగా ఉందని తెలుస్తోంది.

అసలు కవచ్‌ లాంటి సూపర్‌టెక్నాలజీ ఉన్నా ప్రమాదాలు ఎందుకు రిపీటెడ్‌గా జరుగుతున్నాయి. రైల్వే శాఖ భద్రతకు ప్రాధాన్యం పెంచాల్సి ఉందా, సేఫ్టీ సెక్షన్‌లో రిక్రూట్‌మెంట్‌ చేపట్టాల్సి ఉందా?లోకో పైలట్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు మృత్యువాతపడ్డారని, 20-25 మంది గాయపడ్డారని డార్జిలింగ్ జిల్లా పోలీసు అదనపు ఎస్పీ అభిషేక్ రాయ్ వెల్లడించారు. రైలు ప్రమాద ఘటనపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్‌ రైలు ఢీ కొట్టినట్లు చెప్పారు. ఈ ఘటన షాక్‌కు గురి చేసిందన్నారు. వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించినట్లు ఎక్స్‌ వేదికగా తెలిపారు.

Vamshi

Vamshi

Writer
    Next Story