ప్రతిపాదనల్లోనే సంక్షేమ పథకాలు

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే వందరోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పింది. ఏడు నెలలు దాటిని ఇప్పటికీ ఏ ఒక్క పథకం పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్‌పై ఆసక్తి నెలకొన్నది.

ప్రతిపాదనల్లోనే సంక్షేమ పథకాలు
X

2024-25 సంవత్సరానికి రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఈ నెల 25న ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నది. అదేరోజు ఉదయం శాసనసభలోని కమిటీ హాల్‌లో మంత్రివర్గం భేటీ కానున్నది. బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయనున్నది. పూర్తిస్థాయి బడ్జెట్‌ కోసం ఆర్థిక శాఖ దాదాపు కసరత్తు పూర్తి చేసింది. అన్నీ శాఖలో సన్నాహక సమావేశాలు పూర్తిచేసిన ప్రభుత్వం ఆయా శాఖల వారీగా ప్రతిపాదనలు, కేటాయింపుల ఆధారంగా బడ్జెట్‌ లో పద్దులు ఉండనున్నాయి. కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో కొన్ని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత రానున్నది. 2.75 లక్షలతో ఓటాన్‌ అకౌంట్‌ ప్రవేశపెట్టింది. అందులో ఆరు గ్యారెంటీలకు ఉజ్జాయింపుగా రూ, 53,196 కోట్లు ప్రతిపాదించింది. ప్రాథమిక అంచనాల ప్రకారమే ఈ కేటాయింపులు చేసినట్టు ప్రభుత్వం చెప్పింది. విధి విధానాలు పూర్తయిన తర్వాత వాటి అమలు కోసం పూర్తిస్థాయి కేటాయింపులు చేస్తామని తెలిపింది.అయితే ఓటాన్‌ అకౌంట్‌కు ప్రభుత్వం కొద్దిగా అటు ఇటుగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నది.

ఓటాన్‌ అకౌంట్‌లో రైతు భరోసాకు రూ, 15,000 కోట్లు, చేయూత కింద పింఛన్లుకు రూ, 14,800 కోట్లు ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ, 7, 740, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సాయానికి రూ. 7,230 కోట్లు, ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణానికి రూ. 4,084 కోట్లు, గృహజ్యోతి కింద నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ కోసం రూ, 2,418, రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1,065 కోట్లు, రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలు కోసం రూ. 723 కోట్లు, కొత్త ఉద్యోగాల నియామకాల కోసం రూ. 1000 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. రైతు రుణమాఫీ కోసం ఆ సమయంలో బడ్జెట్‌లో రూ. 10 కోట్లు ప్రతిపాదించింది. రుణమాఫీ కోసం రూ. 31 కోట్లు అవసరమవుతాయిని అంచనా వేసింది. అయితే గత ప్రభుత్వం రైతు బంధు కింద జమ చేసిన రూ. 7 వేల కోట్లనే రైతు రుణమాఫీకి మళ్లించందనే విమర్శలున్నాయి. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల్లో ఒక్క ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం తప్పా మిగిలినవి ఏవీ అమల్లోకి రాలేదు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే వందరోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పింది. ఏడు నెలలు దాటిని ఇప్పటికీ ఏ ఒక్క పథకం పూర్తిస్థాయిలో అమలు కాలేదు. కాంగ్రెస్‌ హామీల అమలుపై విపక్షాలు నిలదీస్తున్నాయి. సంక్షేమ పథకాలు దక్కని ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీపై రైతుల్లో అసంతృప్తి నెలకొన్నది. ఒకవైపు కొర్రీలు పెడుతూనే.. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామంటున్న ప్రభుత్వ ప్రకటలను అన్నదాతలు విశ్వసించడం లేదు. ఏడాదిలో రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్‌ సర్కార్‌ ఏడాది కొత్త నియమాకాల కోసం బడ్జెట్‌లో ఎన్ని కోట్లు కోట్లు కేటాయిస్తుందో చూడాలి.ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొన్నది.

గత ప్రభుత్వం అప్పులు చేసిందని దుష్ప్రచారం చేసిన రేవంత్‌ ప్రభుత్వం ఏడు నెలల కాలంలో అప్పులతోనే కాలం వెళ్లదీస్తున్నది. బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు పెద్ద పీట వేస్తామని చెబుతున్నా.. ఆపార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్‌ సరిపోదని ఇప్పటికే ఆర్థిక నిపుణులు చెప్పారు. అందుకే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన అన్నింటిపై యూటర్న్‌ తీసుకుంటున్నది. రుణమాఫీలో కోతలు, రైతు భరోసా అమలు కాలేదు, నిరుద్యోగ భృతి అటకెక్కింది. నియామకాల ఊసే లేదు. రేవంత్‌ సర్కార్‌ మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాల సందర్బంగా విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వ మోసంపై విరుచుకుపడే అవకాశాలున్నాయి.

Raju

Raju

Writer
    Next Story