కాంగ్రెస్ సర్కార్‌లో ఎస్ఆర్డీపి పనులన్నీ ఆగిపోయాయి..కేటీఆర్ ట్వీట్

బీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాద్‌లో ఎస్ఆర్డీపి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రధాన చొరవ తీసుకున్నామని మాజీ మంత్రి తెలిపారు.

ktr
X

హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు, కనెక్టింగ్ రోడ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎస్ఆర్డీపి ద్వారా నగరంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి బీఆర్ఎస్ హయాంలోనే 42 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించింది వీటిలో 36 విజయవంతంగా పూర్తి చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మిగిలిన ప్రాజెక్టులను కూడా 2024లో పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కొనసాగుతున్న ఎస్ఆర్డీపి పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహించారు. గత 8 నెలలుగా సరైన పర్యవేక్షణ లేక సకాలంలో చెల్లింపులు లేవని నిప్పులు చెరిగారు కేటీఆర్.

ఎస్ఆర్డీపి మూడవ దశ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ మేరకు ఫోటోలతో సహా పోస్టు పెట్టారు కేటీఆర్. కానీ రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగుతున్న ఎస్ఆర్డీపి పనులన్నీ మందగించాయని వెల్లడించారు. పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయని ఎద్దేవా చేశారు. గత 8 నెలలుగా సరైన పర్యవేక్షణ లేక కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు కూడా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఆర్డీపి ఫేజ్- 3 ని తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరండని కేటీఆర్ అన్నారు. ఈ జాబితాలో మూసీతో పాటు ఎక్స్‌ప్రెస్ వే, కేబీఆర్ పార్క్ కింద టన్నెల్స్, ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌లు ఇలా.. అనేక ఇతర గ్రేడ్ సెపరేటర్లు ఉన్నాయని తెలిపారు.

Vamshi

Vamshi

Writer
    Next Story