ఆస్ట్రేలియాపై అఫ్ఘాన్ సంచలన విజయం
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-8లో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై అఫ్ఘానిస్థాన్ 21 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది
- By RajuLoading...
- | 23 Jun 2024 4:23 AM GMT
X
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-8లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై అఫ్ఘానిస్థాన్ 21 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 127 పరుగులకే కుప్పకూలింది. అఫ్ఘాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3, గుల్బదీన్ నైబ్ 4 వికెట్లు తీశారు.
Also Read - బంగ్లాపై భారత్ ఘన విజయం.. సెమీస్ బెర్త్ దాదాపు ఖాయమే!
అఫ్ఘాన్ బ్యాటర్లలో గుర్బాజ్ (60), ఇబ్రహీం జద్రాన్ (51) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లోనే ఆసీస్ ఫేస్బౌలర్ పాట్ కమిన్స్ వరుసగా మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించి రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయినా ఆసీస్ జట్టు బ్యాటర్లు రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. ఆ జట్టు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (౫౯ రాణించినా.. మిగతా బాట్స్మెన్లు విఫలం కావడంతో ఆసీస్ 127 పరులకే ఆలౌట్ అయ్యింది. దీంతో గ్రూప్-1 రెండు విజయాలు సాధించిన భారత్ సెమీస్ బెర్త్ దాదాపు ఖరారు చేసుకోగా.. ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్ ఒక్కో మ్యాచ్ల్ గెలిచి రేస్‌లో ఉన్నాయి