కేంద్ర బడ్జెట్‌లో 9 ప్రాధాన్య అంశాలు.. కేటాయింపులు

కేంద్ర బడ్జెట్‌ మొత్తం పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు. పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు.ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది.

కేంద్ర బడ్జెట్‌లో 9 ప్రాధాన్య అంశాలు.. కేటాయింపులు
X

కేంద్ర బడ్జెట్‌లో తొమ్మిది అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. దాని ఆధారంగా బడ్జెట్ కు రూపకల్పన చేసింది. అవి 1) వ్యవసాయ ఉత్పాదకత, 2) ఉద్యోగ కల్పన-నైపుణ్యాభివృద్ధి, 3), సమ్మిళిత వృద్ధి- సామాజిక న్యాయం 4), పట్టణాలు, నగరాల అభివృద్ధి, 5) తయారీ రంగానికి ఊతం 6) ఇంధనరంగ భద్రత మౌలిక వసతుల అభివృద్ధి, 7) ఆవిష్కరణలు, భవిష్యత్‌ సంస్కరణలు, 8) ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి, 9) భవిష్యత్‌ సంస్కరణలు

కేంద్ర బడ్జెట్‌ మొత్తం పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు. పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు.ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు అంచనా వేసింది.నూతన పింఛన్‌ విధానంలో త్వరలో మార్పులు చేయనున్నట్లు సంప్రదింపుల కమిటీ సిఫార్సుల ఆధారంగా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలో ,ఇతర దేశాల్లో భారత్‌ పెట్టుబడుల విధానంలో సరళీకరణ విధానాలను అమలు చేయనున్నట్లు చెప్పారు. వాణిజ్య అనుకూల విధానాలకు జన్‌ విశ్వాస్‌ బిల్లుతో మరిన్ని సంస్కరణలు అమలు చేయనున్నారు. భవిష్యత్‌ తరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. యూఎల్‌ పిన్‌ ద్వారా ప్రతి భూకమతానికి ప్రత్యేక యూఎల్‌ పిన్‌ నెంబర్‌ ను కేటాయింపు ఇస్తామన్నారు.

క్యాపిటల్‌ గెయిన్స్‌ విధానం సరళీకరణ

లాంగ్‌ టర్మ్‌ గెయిన్స్‌పై 12.5 శాతం పన్ను విధించనున్నట్లు, క్యాపిటల్‌ కనిష్ఠ పరిమితి రూ. 1.25 లక్షలు విధించనున్నట్లు పేర్కొన్నారు. స్టార్టప్‌లకు ప్రోత్సాహకంతో పాటు ఏంజెల్‌ ట్యాక్స్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

మొబైల్‌ ఫోన్లపై సుంకం తగ్గింపు

క్యాన్సర్‌ రోగుల మందులపై సుంకం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. మొబైల్‌ ఫోన్లు, మొబైల్‌ పీసీడీఏ, మొబైల్‌ ఛార్టర్లపై విధించే బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు.

బంగారం, వెండిపై కస్టమ్‌ డ్యూటీ 6 శాతానికి తగ్గింపు

బంగారం, వెండిపై కస్టమ్‌ డ్యూటీ తగ్గించారు. బంగారం, వెండిపై కస్టమ్‌ డ్యూటీ 6 శాతానికి తగ్గించారు. ప్లాటినమ్‌పై 6.4 శాతానికి కుదించారు. స్టాంప్‌ డ్యూటీ పెంచుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్‌ డ్యూటీ తగ్గించింది.

స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెంపు

స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెంచినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి ఇది వర్తిస్తుందన్నారు.

బీహార్‌లో వరద నివారణకు రూ. 11,500 కోట్లు

ఇటీవల కాలంలో వరదల కారణంగా బీహార్‌లో 10కిపైగా బ్రిడ్జిలు కూలిపోయాయి.. ఈశాన్య రాష్ట్రంలో వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో వరదల వల్ల బీహార్‌ ఏటా నష్టపోతున్నదని వరద నివారణకు, సాగు కార్యక్రమాల కోసం రూ. 11,500 కోట్లు కేటాయించింది.అస్సాం, హిమాచల్‌ ప్రదేశ్‌లో వరద నివారణకు ప్రత్యేక నిధులు కేటాయించింది.

Raju

Raju

Writer
    Next Story