కాంగ్రెస్ ప్రభుత్వ 9 నెలల పాలనలో.. 475 మంది రైతులు ఆత్మ‌హ‌త్య : హరీశ్‌రావు

ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు సురేంద‌ర్ రెడ్డిది ఆత్మ‌హ‌త్య కాదు.. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌త్య అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు

Harish
X

కాంగ్రెస్ ప్రభుత్వ 9 నెలల పాలన రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ వచ్చాక 475 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని హరీశ్‌రావు పేర్కొన్నారు. నిన్న మేడ్చ‌ల్ వ్య‌వ‌సాయ శాఖ కార్యాల‌యం ఎదుట ఆత్మ‌హ‌త్య చేసుకున్న సురేంద‌ర్ రెడ్డిది ఆత్మ‌హ‌త్య కాదు.. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌త్య అని తెలిపారు. అందరికీ రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పారు. కానీ కొంత మందికి మాత్రమే రుణమాఫీ చేశారు. రుణమాఫీ కానీ రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ప్రభుత్వం 31 సాకులు చూపించిందని మాజీమంత్రి తెలిపారు. జాయింట్ ఫ్యామిలీ అని, సింగిల్ ఫార్మల్ అని, ఆధార్ మిస్ మ్యాచ్ అని, రెన్యూవల్ చేసుకోలేదంటూ వంటి కారణాలను చూపించి రైతులనే దగా చేశారని మండిపడ్డారు. రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ మాట తప్పారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లీ కొడుకు మధ్య చిచ్చు పెట్టాడని పేర్కొన్నారు. గతంలో పాస్ బుక్ ఉంటే.. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదన్నారు. 21లక్షల మందికి రుణమాఫీ కాలేదని.. ఇది నేను చెబుతున్న మాట కాదు.. వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారని గుర్తు చేశారు హరీశ్ రావు. కేసీఆర్ పాల‌న‌లో త‌ల్లుల‌ను పిల్ల‌లు స‌రిగా చూడ‌డం లేద‌ని 200 ఉన్న పెన్ష‌న్‌ను రూ. 2 వేలు చేసి కుటుంబ బంధాల‌ను బ‌లోపేతం చేశారు.

కానీ నీవు కోత‌లు పెట్ట‌డానికి రుణ‌మాఫీ డ‌బ్బు త‌గ్గించ‌డానికి కుటుంబాల మ‌ధ్య చిచ్చు పెట్ట‌న చ‌రిత్ర రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. 49 వేల కోట్ల రుణాలు మాఫీ చేసేస్తా అన్న‌వ్. మ‌రి ఎందుకు కోత‌లు పెడుతున్నావ్.. మంత్రి వర్గ సమావేశం అయ్యాక నీవే ప్రెస్ మీట్ పెట్టి రూ. 31వేల కోట్లు 41 ల‌క్ష‌ల మంది రైతుల‌కు మాఫీ చేస్తా అన్న‌వ్. బ‌డ్జెట్‌లో చూస్తే రూ. 26 ల‌క్ష‌ల కోట్లు పెట్టావ్.. చేసిందేమో కేవ‌లం రూ. 17 వేల కోట్లు మాత్ర‌మే. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ముందు దేవుడి మీద ఒట్టు పెట్టి పంద్రాగ‌స్టు లోగా రుణ‌మాఫీ పూర్తి చేస్తామని మయా మాటలు చెప్పారని మాజీ మంత్రి అన్నారు

Vamshi

Vamshi

Writer
    Next Story