2036 ఒలింపిక్స్‌ హైదరాబాద్‌లో నిర్వహిస్తాం : సీఎం రేవంత్‌

క్రీడా కార్యక్రమాలకే గచ్చిబౌలి స్పోర్ట్స్‌ విలేజ్‌ను వినియోగిస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘ఎన్‌ఎండీసీ హైదరాబాద్‌’ మారథాన్‌ విజేతలకు గచ్చిబౌలి మైదానంలో ముఖ్యమంత్రి బహుమతులు అందజేశారు.

2036 ఒలింపిక్స్‌ హైదరాబాద్‌లో నిర్వహిస్తాం : సీఎం రేవంత్‌
X

తెలంగాణ యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మరథాన్ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గోన్నారు. గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని రేవంత్ తెలిపారు. అంతర్జాతీయ స్ధాయి కోచ్‌లను తీసుకొచ్చి క్రీడలకు శిక్షణ అందిస్తామని ప్రకటించారు. ఒలింపిక్స్ ను హైదరాబాద్ లో నిర్వహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో మన స్టేడియంలను తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రికి తెలిపామని సీఎం చెప్పారు….

దేశంలోనే క్రీడలకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లు అత్యధిక పతకాలు సాధించేలా కృషి చేస్తున్నాం. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ వర్సిటీని వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తాం. ‘ఖేలో ఇండియా’ నిర్వహణను తెలంగాణకు ఇవ్వాలని కేంద్రానికి విన్నవించాం. 2036 ఒలింపిక్స్‌ నిర్వహణ బిడ్డింగ్‌ను భారత్‌ గెలిస్తే హైదరాబాద్‌లో గేమ్స్‌ నిర్వహించే అవకాశం ఇవ్వాలని కోరాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఒలింపిక్స్ తెలంగాణలో నిర్వహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియాలను మారుస్తామని రేవంత్ అన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story