రాహుల్‌ను కలిసిన రెజ్లర్లు వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియా

కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం

రాహుల్‌ను కలిసిన రెజ్లర్లు వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియా
X

రెజ్లర్లు వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియా.. కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. ఆ ఫొటోను కాంగ్రెస్‌ పార్టీ తమ 'ఎక్స్‌' ఖాతాలో షేర్‌ చేసింది. రాహుల్‌ను వీరు ఎందుకు కలిశారన్నది స్పష్టత లేనప్పటికీ త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నది. ఎన్నికల్లో ఫొగాట్‌, పునియా పోటీ ఖాయమనే ప్రచారం జరుగుతున్నది.

వినేశ్‌ ఫొగాట్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని ప్రచారంపై ఇటీవల స్పందించారు. దీనికి రైతు ఆందోళన వేదికైంది. హర్యానాలోని అంబాలకు సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద రైతులు కొన్నేళ్లుగా ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన 200వ రోజుకు చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫొగాట్‌ పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీ కుమార్తె మీ వెంటే ఉంటుందని వ్యాఖ్యానించింది. ఆ సందర్భంగా మీరు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారా? అని విలేకరి ప్రశ్నించగా.. ఈ అంశంపై మాట్లాడదలుచుకోలేదు. నా రైతు కుటుంబాన్ని కలుసుకోవడానికే ఇక్కడి వచ్చాను. మీరు దృష్టిని నావైపు మళ్లిస్తే వారి పోరాటం, కష్టాలు వృథా అవుతాయన్నారు. ఇక్కడ నాపై ఫోకస్‌ ఉండకూదన్న ఆమె రైతులపై మాత్రమే ఉండాలన్నది. నేనొక క్రీడాకారిణిని, భారతీయురాలిని. ఎన్నికలపై నాకు ఎలాంటి ఆందోళన లేదు. రైతుల సంక్షేమంపై మాత్రమే నా దృష్టి ఉన్నదని జవాబిచ్చారు.

పారిస్‌ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల బరువు కారణంగా అనర్హతవేటుకు గురై స్వదేశానికి వచ్చినప్పుడు విమానాశ్రయంలో ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నది. ఆమెను ఎంపీ దీపిందర్‌ హుడా, రెజ్లర్లు సాక్షిమా లిక్‌, బజరంగ్‌ పునియా తదిరులు ఓదార్చారు.

Raju

Raju

Writer
    Next Story