వినేశ్‌ మీరు ఛాంపియన్లలోనే ఛాంపియన్‌:ప్రధాని మోడీ

వినేశ్‌ ఫొగాట్‌ అర్హత సాధించలేకపోవడంపై ప్రధాని మోడీ స్పందించారు. 'వినేశ్‌ ఛాంపియన్లలోనే ఛాంపియన్‌ అని, సవాళ్లు ఎదిరించడం మీ నైజం. మీకు మేమంతా అండగా ఉన్నామని ప్రధాని భరోసా ఇచ్చారు.

వినేశ్‌ మీరు ఛాంపియన్లలోనే ఛాంపియన్‌:ప్రధాని మోడీ
X

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ అర్హత సాధించలేకపోవడంపై ప్రధాని మోడీ స్పందించారు. 'వినేశ్‌ మీరు ఛాంపియన్లలోనే ఛాంపియన్‌.. మీరు దేశానికి , దేశ ప్రజలందరికీ గర్వకారణం, భారతీయులందరికీ స్ఫూర్తి. నేడు మీకు తగిన ఎదురుదెబ్బ ఎంతో బాధించింది. దీన్ని వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటలు లేవు. కానీ ఈ బాధ నుంచి బైట పడి మీరు బలంగా తిరిగి రాగలరని నేను నమ్ముతున్నాను. సవాళ్లు ఎదిరించడం మీ నైజం. మీకు మేమంతా అండగా ఉన్నామని' ప్రధాని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

వినేశ్‌ ఫొగాట్‌ అనర్హత వేటు అంశంపై కేంద్ర క్రీడల శాఖమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మధ్యాహ్నం లోక్‌సభలో ప్రకటన చేయనున్నారు. మరోవైపు వినేశ్‌ ఫైనల్‌లో అర్హత కోల్పోవడంపై బ్రిజ్‌ భూషణ్‌ తనయుడు, బీజేపీ ఎంపీ కరణ్‌ భూషన్‌ స్పందించాడు. ఇది దేశానికి జరిగిన నష్టం అన్నారు. ఫెడరేషన్‌ దీన్ని పరిగణనలోకి తీసుకుంటుందని, ఏం చేయాలనే దానిపై నిర్ణ యం తీసుకుంటామన్నారు.

వినేవ్‌ ఫొగాట్‌ మొదటిసారి ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. ఇవాళ రాత్రి ఫైనల్‌లో తలపడాల్సి ఉండగా..ఆమె బరువును చూసిన నిర్వాహకులు 50 కిలోల కన్నా 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. ఫలితంగా వినేశ్‌పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్‌ కమిటీ, రెజ్లింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. అనర్హత కారణంగా ఫొగాట్‌ పతకం పొందే అవకాశాన్ని కోల్పోవడం పట్ల భారతీయ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Raju

Raju

Writer
    Next Story