టీ20 ప్రపంచకప్‌ తుది సమరం నేడే

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ పోరుకు బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌ వేదికైంది. ఫైనల్‌కు చేరిన భారత్‌, దక్షిణాఫ్రికా ఒక్క మ్యాచ్‌ ఓడిపోకుండా ఫైనల్‌ కు చేరడంతో పైనల్‌ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొన్నది.

టీ20 ప్రపంచకప్‌ తుది సమరం నేడే
X

టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ భారత్‌-దక్షిణాఫ్రికాల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్నది. రాత్రి 8 గంటలకు ఇరు జట్లు టైటిల్ కోసం నువ్వా నేనా అన్నట్లు సిద్ధమయ్యాయి. లీగ్‌ దశ నుంచి ఈ రెండు ఒక్క ఓటమి లేకుండా ఫైనల్‌కు చేరాయి. దీంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొన్నది. టీ 20 ప్రపంచకప్‌ను భారత్‌ 2007లో కైవసం చేసుకున్నది. అప్పటి నుంచి 17 ఏళ్లుగా ట్రోఫీ భారత్‌కు దక్కలేదు. దీంతో ఈసారి ఎలాగైనా కప్‌ చేజిక్కించుకోవాలనుకుంటున్నది. అలాగే వన్డేల్లోనూ, టీ 20 ల్లో దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరడం ఇదే మొదటిసారి. దీంతో ప్రపంచ కప్‌ గెలవాలనే తన కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నది. సమిష్టి ప్రదర్శనతో టీమీండియా ఫైనల్‌కు చేరింది. దక్షిణాఫ్రికా కూడా బలంగానే ఉన్నది. అందుకే ఆ జట్టును తేలిగ్గా తీసుకోవడం లేదని భారత జట్టు ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ అన్నారు.

ఈ టోర్నీలో బ్రిడ్జ్‌ టౌన్‌ వేదికగా టీమిండియా అఫ్ఘాన్‌పై నెగ్గింది. ఈ వేదికపై దక్షిణాఫ్రికా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. బ్రిడ్జ్‌టౌన్‌ పిచ్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటికీ సమానంగా అనుకూలంగా ఉంటుంది. ఈ సారి ప్రపంచకప్‌ బ్రిడ్జ్‌టౌన్‌ వేదికగా 6 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలగా ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. 3 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు గెలువగా మరో మూడు మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ చేసిన జట్టును విజయం వరించింది. బ్రిడ్జ్‌టౌన్‌ వేదికగా ఇప్పటివరకు 532 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు 19 సార్లు, 11 సార్లు సెకండ్‌ బ్యాటింగ్‌ చేసిన జట్లు గెలిచాయి. ఒక మ్యాచ్‌ టైగా, మరో రెండు మ్యాచ్చుల్లో ఫలితం తేలదేదు.

ఫైనల్‌ టైగా ముగిస్తే సూపర్‌ ఓవర్‌ ఫలితాన్ని తేల్చనున్నది. ఫలితం తేలేవరకు సూపర్‌ ఓవర్లు కొనసాగనున్నాయి. వర్షం కారణంగా సూపర్‌ ఓవర్‌ సాధ్యం కాకుంటే సంయుక్త విజేతగా ఇరు జట్లను ప్రకటించనున్నారు. ఇవాళ్టి మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నది. కనీసం 10 ఓవర్లు సాధ్యం కాకపోతే రిజర్వ్‌డేకు మ్యాచ్‌ వాయిదా పడుతుంది. ఇవాళ మ్యాచ్‌ ఆగితే.. అక్కడి నుంచే రేపు కొనసాగనున్నది. రిజర్వ్‌ డేలో మ్యాచ్‌ సాధ్యం కాకపోతే ఇరుజట్లను విజేతలుగా ప్రకటిస్తారు.

Raju

Raju

Writer
    Next Story