విరాట్‌ స్థాయి ఏమిటో కెప్టెన్‌ చెప్పాడు.. ఫైనల్‌లో కోహ్లీ చూపెట్టాడు

ఒత్తిడి ఉన్నప్పుడు ఏ ఆటగాడైనా తప్పులు చేస్తారు. కానీ కోహ్లీ లాంటి ఛాంపియన్‌ స్థాయి ఆటగాళ్లు ఒత్తిడిలోనూ మరింత ఏకగ్రతతో ప్రత్యర్థులను చిత్తు చేస్తారు. ఫైనల్‌లో కోహ్లీ అదే చేశాడు.

విరాట్‌ స్థాయి ఏమిటో కెప్టెన్‌ చెప్పాడు.. ఫైనల్‌లో కోహ్లీ చూపెట్టాడు
X

ఇండియా, సౌతాఫ్రికా లీగ్‌ స్టేజి నుంచి సెమీస్‌ వరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా టీ 20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరాయి. ఇప్పటివరకు ఏ ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరని దక్షిణాఫ్రికా, 17 ఏళ్ల నుంచి భారత్‌ను ఊరిస్తున్న పొట్టి కప్పుకు కొట్టేది ఎవరు అన్న ఆసక్తి నెలకొన్నది. గత బలాబలాలు, ఈ టోర్నీలో బ్రిడ్జ్‌ టౌన్‌ వేదికగా టీమిండియా అఫ్ఘాన్‌పై నెగ్గిడం భారత్‌కు కలిసి వచ్చే అంశాలుగా కనిపించాయి. అయితే స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కోహ్లీ ఫామ్‌పైనే అందరికీ అనుమానాలు ఉన్నాయి. కీలకమైన ఈ టోర్నీలో ఆయన విఫలం కావడమే దీనికి కారణం.

ఎందుకంటే లీగ్‌ స్టేజ్‌ నుంచి సెమీస్‌ వరకు సూపర్‌ 8లో బంగ్లాదేశ్‌పై సాధించిన 37 పరుగులే అత్యుత్తం. గ్రూప్‌ స్టేజ్‌లో ఐర్లాండ్‌, పాకిస్థాన్‌, యూఎస్‌ఏపై అతని ప్రదర్శన 1, 4, 0తో చాలా పేలవంగా ఉన్నది. సూపర్‌ 8లోనూ బంగ్లాదేశ్‌పై మినహా అఫ్ఘాన్‌పై 27, ఆస్ట్రేలియాపై 0, ఇంగ్లాండ్‌పై 9.ఈ టోర్నీలో కోహ్లీ మార్క్‌ మెరుపులు కనిపించకపోవడం, రెండు సార్లు డకౌట్‌ కావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కోహ్లీ క్రీజ్‌లో నిలదొక్కుకుంటేనే భారత జట్టు విజయం ఈజీ అవుతుందని మాజీ క్రికెటర్ల కామెంట్లు.

ఇదే విషయాన్ని కెప్టెన్‌ రోహిత్‌ శర్మను మ్యాచ్‌ ముందు అడిగితే ' విరాట్‌ స్థాయి ఏమిటో మాకు తెలుసు. ముఖ్యమైన మ్యాచ్‌లలో అతను ఎలా ఆడుతాడో తెలుసు. బహుశా ఫైనల్‌ మ్యాచ్‌ కోసం అతను తన ఉత్తమ ప్రదర్శనను దాచుకున్నాడేమో' అన్నాడు. అవును అన్నటే ది కింగ్‌ కోహ్లీ ఫైనల్‌లో (76 ; 56 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్రం కీలక ఇన్నింగ్స్‌ ఆడి రోహిత్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడు.

ఒత్తిడి ఉన్నప్పుడు ఏ ఆటగాడైనా తప్పులు చేస్తారు. కానీ కోహ్లీ లాంటి ఛాంపియన్‌ స్థాయి ఆటగాళ్లు ఒత్తిడిలోనూ మరింత ఏకగ్రతతో ప్రత్యర్థులను చిత్తు చేస్తారు. ఫైనల్‌లో కోహ్లీ అదే చేశాడు. తన బ్యాటింగ్‌ వైఫల్యంపై వచ్చిన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. అనంతరం టీ 20 ప్రపంచకప్‌ నుంచి తన రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ప్రస్తుతం జట్టులో చోటు దక్కించుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కొత్త వారికి అవకాశం రావాలంటే సీనియర్లు నిర్ణీత సమయంలో తప్పుకోవాలి. ఇదే విషయాన్ని కోహ్లీ చెప్పాడు. తర్వాత తరానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే వెనక్కి తగ్గుతున్నాను అని చెప్పడం అందరికీ నచ్చింది.

టీ 20 ప్రపంచకప్‌, వన్డే వరల్డ్‌ కప్‌ సాధించిన జట్టులో ఉన్న అతికొద్ది మంది క్రికెటర్లలో కోహ్లీ ఒకడు. 2011 వన్డే ప్రపంచకప్‌, 2024లో టీ 20 వరల్డ్‌ కప్‌ టీంలో ఉన్నాడు. కోహ్లీ 2010లో జింబాబ్బేపై టీ 20 అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌ మొత్తం 125 మ్యాచ్‌లు ఆడాడు. 48.69 సగటుతో 4188 రన్స్‌ సాధించాడు. వీటిలో ఒక సెంచరీ, 38 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. తన టీ 20 చివరి మ్యాచ్‌ను మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తో ముగించాలని అనుకున్నాడు. అలాగే ముగించాడు.

Raju

Raju

Writer
    Next Story