మన అథ్లెట్లకు మద్దతు ఇవ్వండి: ప్రధాని

ఒలింపిక్స్‌కు వెళ్లిన అథ్లెట్లకు శుభాకాంక్షలు చెబుతామని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఒలింపిక్స్‌లో పతకం గెలిస్తే ఎందరికో స్ఫూర్తి కలుగుతుంది అన్నారు.

మన అథ్లెట్లకు మద్దతు ఇవ్వండి: ప్రధాని
X

ఒలింపిక్స్‌కు వెళ్లిన అథ్లెట్లకు శుభాకాంక్షలు చెబుతామని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఒలింపిక్స్‌లో పతకం గెలిస్తే ఎందరికో స్ఫూర్తి కలుగుతుంది అన్నారు. మన్‌కీ బాత్‌ 112 వ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు.

యూకోలో జరిగిన అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌ 2024లో పాల్గొని పతకాలు సాధించిన జట్టును అభినందించారు. అసోంలోని చారాడ్‌దేవ్‌ మోదమ్‌కు యునెస్కో వారసత్వ క్షేత్రంగా గుర్తింపు రావడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ గౌరవం దక్కించుకుఉన్న 43వ ప్రదేశమని పేర్కొన్నారు.

మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. అహోం సామ్రాజ్యం గొప్పతనం గురించి వివరించారు. 13-19 శతాబ్దం వరకు అహోం సామ్రాజ్యం ఉన్నది. మన దేశంలో అద్భుతమైన పెయింటర్స్‌ ఉన్నారు. రోడ్ల పక్కన అందమైన పెయింటింగ్స్‌ కనిపిస్తాయి. హర్యానా రాష్ట్రంలోని రోహ్‌తక్‌ జిల్లా మహిళలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.

ఏ దేశమైనా తమ వారసత్వ సంపదను ముందుకు తీసుకెళ్తేనే అభివృద్ధి సాధిస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా చేసిన ప్రయత్నమే ప్రాజెక్టు పరి అని పేర్కొన్నారు. భారత్‌ మండపంలో కళాకృతుల్లో దేశ సంస్కృతి ఉట్టిపడుతున్నది అన్నారు.

Raju

Raju

Writer
    Next Story