స్కాట్‌లాండ్‌ ఇంటికి.. సూపర్‌8 కు ఇంగ్లాండ్‌

టీ 20 ప్రపంచ కప్‌ పోటీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో స్కాట్‌లాండ్‌పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అనంతరం కంగారు జట్టు 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు సాధించి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నది.

స్కాట్‌లాండ్‌ ఇంటికి.. సూపర్‌8 కు ఇంగ్లాండ్‌
X

టీ 20 ప్రపంచ కప్‌ పోటీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో స్కాట్‌లాండ్‌పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన స్కాట్‌లాండ్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఆస్ట్రేలియా ముందు 181 లక్ష్యాని నిర్ధారించింది. అనంతరం కంగారు జట్టు 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు సాధించి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నది. ఆస్ట్రేలియా జట్టులో ట్రావిస్‌ హెడ్‌ 68, స్టొయినిస్‌ 59 పరుగులు చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

అంతకు ముందు మ్యాచ్‌లో నమిబియాపై ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ ఐదు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడిన స్కాట్‌లాండ్‌ మూడు వికెట్లు కోల్పోయి 84 పరుగులే చేయగలిగింది.

వర్షం వల్ల స్కాట్‌లాండ్‌ వర్సెస్‌ ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ రద్దైన విషయం విదితమే. నమిబియాతోనూ అదే జరిగి ఉంటే ఇంగ్లాండ్‌ ఇంటి బాట పట్టేదే. కానీ ఆ జట్టుకు అదృష్టం కలిసి వచ్చింది. దీంతో గ్రూప్‌-బీలో ఇరు జట్ల పాయింట్లు సమమైనప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో స్కాట్‌లాండ్‌ను (+1.255) ను ఇంటికి పంపి ఇంగ్లాండ్‌ (+3.611) సూపర్‌ 8 కు వెళ్లింది.

Raju

Raju

Writer
    Next Story