వన్డేలు, టెస్టులకు కెప్టెన్‌గా రోహిత్‌నే కొనసాగిస్తాం: జైషా

సుదీర్ఘకాలం తర్వాత భారత్‌కు టీ 20 వరల్డ్‌ కప్‌ ట్రోఫీని అందించిన హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ముందు వచ్చే ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ, ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌లు ఉన్నాయి.

వన్డేలు, టెస్టులకు కెప్టెన్‌గా రోహిత్‌నే కొనసాగిస్తాం: జైషా
X

టీ20 వరల్డ్‌ కప్‌ను అందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆ ఫార్మట్‌కు వీడ్కోలు పలికారు.అయితే వచ్చే ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫి, మూడో వరల్డ్‌ టె్ట్ ఛాంపియన్‌ షిప్‌ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వన్డే ఫార్మాట్‌లో రోహితే కెప్టెన్‌గా కొనసాగనున్నారని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశారు. ఆయన సారథ్యంలోనే వీటిలో గెలువనున్నట్లు జై షా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కు భారత్‌ చేరితే జట్టుకు రోహితే నాయకత్వం వహిస్తాడని జై షా చెప్పారు.

ఛాంపియన్స్‌ ట్రోఫి 2025 ఫిబ్రవరి-మార్చి మధ్య పాకిస్థాన్‌లో జరగనున్నది. రోహిత్‌ నాయకత్వంలోనే టీమిండియా గత వన్డే వరల్డ్‌కప్‌, ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఫైనల్‌కు చేరింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆయా మ్యాచ్‌ల్లో ఓడిపోయి రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నది.

2025లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ అర్హత సాధిస్తే సీనియర్లు కూడా ఉంటారని భారత జైషా హామీ ఇచ్చారు.రోహిత్‌ పాటు భారత స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ, ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజాలు కూడా టీ20 గుడ్‌బై చెప్పారు. దీంతో వాళ్లు వన్డేలు, టెస్టుల్లో వచ్చే ఏడాది చివరకు కొనసాగనున్నారని జై షా వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది.

Raju

Raju

Writer
    Next Story