పారిస్‌ ఒలింపిక్స్‌.. రేపే ప్రారంభం

పారిస్‌ ఒలింపిక్స్‌ రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఆగస్టు 11 వరకు ఈ విశ్వ క్రీడా సమరం జరగనున్నది.

పారిస్‌ ఒలింపిక్స్‌.. రేపే ప్రారంభం
X

పారిస్‌ ఒలింపిక్స్‌ రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఆగస్టు 11 వరకు ఈ విశ్వ క్రీడా సమరం జరగనున్నది. 200 లకు పైగా దేశాల క్రీడా బృందాలు ఇందులో పాల్గొననున్నాయి. ఇందులో 10,500 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న ఫాన్స్‌ పోటీల నిర్వహణ కోసం రూ. 80 వేల కోట్లకు పైగా వ్యయం చేస్తున్నది.

ఈ పోటీలలో మన భారతీయులు 117 మంది పాల్గొననున్నారు. హర్యానా, పంజాబ్‌ నుంచి 43 మంది, ఏపీ నుంచి ఐదు గురు, తెలంగాణ నుంచి ముగ్గురు అథ్లెట్లు పాల్గొంటున్నారు.

టోక్యో ఒలింపిక్స్‌-2020 లో భారత్‌ ఏడు పతకాలు సాధించింది. ఇండియా ఇప్పటి వరకు 10 స్వర్ణాలు సహా 35 మెడల్స్‌ సాధించింది. హాకీలోనే ఎనిమిది స్వర్ణాలు గెలిచింది. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో అభినవ్‌ బింద్రా షూటింగ్‌ లో స్వర్ణం గెలిచాడు. టోక్యో క్రీడల్లో నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రోలో స్వర్ణం సాధించాడు.

Raju

Raju

Writer
    Next Story