పారాలింపిక్స్‌.. భారత్‌ ఖాతాలో మరో పతకం

షూటింగ్‌ విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్‌ ఫైనల్‌లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం కైవసం చేసుకున్నది.

పారాలింపిక్స్‌.. భారత్‌ ఖాతాలో మరో పతకం
X

పారాలింపిక్స్‌ లో భారత్‌ మరో పతకం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ ఎస్‌హెచ్‌-1 షూటింగ్‌ విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్‌ ఫైనల్‌లో 211.1 స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం కైవసం చేసుకున్నది. జవాన్మార్డి సారె (ఇరాన్‌) 236.8 స్కోర్‌తో స్వర్ణం సాధించింది. తుర్కియోకు చెందిన ఐసెల్‌ ఓజ్గాన్‌ (231.1) రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నది. దీంతో భారత్‌ ఖాతాలో ఇప్పటివరకు ఐదు (1 స్వర్ణం, 1 రజతం, 3 కాంస్యం) పతకాలు వచ్చి చేరాయి.

శుక్రవారం షూటింగ్‌లోనే అవని లేఖరా స్వర్ణం, మనీశ్‌ నర్వాల్‌ రజతం, మోనా అగర్వాల్‌ కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. అలాగే మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో ప్రీతిపాల్‌ కాంస్యం గెలుచుకున్నది. బ్యాడ్మింటన్‌లో భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. పురుషుల ఎస్‌ఎల్‌4 ఈవెంట్‌లో సుకాంత్‌ కదమ్‌, సుహాస్‌ యతిరాజ్‌ సెమీస్‌కు చేరకున్నారు.

పారాలింపిక్స్‌ లో భారత ఆర్చర్‌ సరితా దేవి క్వార్టర్స్‌కు చేరింది. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత ప్రిక్వార్టర్స్‌లో 141-135తో ఎలెనోరా (ఇటలీ) ఆమె విజయం సాధించింది.

Raju

Raju

Writer
    Next Story