జింబాబ్వే ​టూర్​కు భారత జట్టు ప్రకటన..తెలుగు తేజం నితీశ్‌కు చోటు

జింబాబ్వే సిరీస్ కోసం భార‌త క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్ర‌క‌టించింది.

Team india
X

జింబాబ్వేతో ఆ దేశంలో జులై 6 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు జట్టులో నలుగురు ఆటగాళ్లు తొలిసారి భారత్ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నారు. తెలుగు తేజం నితీశ్ రెడ్డి, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్ పాండేకు జట్టులో చోటు దక్కింది. వీరంతా తొలిసారి టీమ్ ఇండియా జెర్సీలో కనిపించనున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఈ ప్లేయర్లు సత్తా చాటిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన జురెల్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు.

జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు ప‌లువురు సీనియ‌ర్లను బీసీసీఐ ప‌క్క‌న పెట్ట‌నుంది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడుతున్నకెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాల‌తో పాటు సూర్య‌కుమార్ యాద‌వ్‌కు భార‌త బోర్డు విశ్రాంతి ఇవ్వ‌నుంది. దాంతో, యువ‌కుల‌తో నిండిన జ‌ట్టును జింబాబ్వేకు పంపాల‌ని సెలెక్ట‌ర్లు భావిస్తున్నారు.ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌ధాన కోచ్ ఎవ‌రో తేల‌లేదు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ముగిసేలోపు గౌతం గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా ప్ర‌క‌టిస్తారో? లేదో తెలియ‌దు.

దాంతో, నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ చైర్మ‌న్‌గా కొన‌సాగుతున్న‌ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ జింబాబ్వే సిరీస్‌కు కోచ్‌గా వ్య‌వ‌హ‌రించే చాన్స్ ఉంది.భార‌త్, జింబాబ్వే జ‌ట్లు జూలై 6వ తేదిన తొలి మ్యాచ్ ఆడ‌నున్నాయి. మొత్తం ఐదు మ్యాచ్‌ల‌కు హ‌రారే స్పోర్ట్స్ క్ల‌బ్ వేదిక కానుంది. జూలై 7 వ తేదీన రెండో టీ20, జూలై 10న మూడో టీ20, జూలై 13న నాలుగో టీ20, జూలై 14న ఐదో టీ20 జ‌రుగ‌నుంది. మ‌ధ్యాహ్నం 1 గంట‌కు మ్యాచ్‌లు షురూ అవుతాయి.

శుభ్‌మన్ గిల్(కెప్టెన్), య‌శ‌స్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శ‌ర్మ‌, రింకూ సింగ్, సంజూ శాంస‌న్(వికెట్ కీప‌ర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీప‌ర్), నితీశ్ కుమార్ రెడ్డి, రియాన్ ప‌రాగ్, వాషింగ్ట‌న్ సుంద‌ర్, ర‌వి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖ‌లీల్ అహ్మ‌ద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే.

Vamshi

Vamshi

Writer
    Next Story