పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం

మహిళల టీ20 ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌ శుభారంభం చేసింది.

పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం
X

మహిళల టీ20 ఆసియా కప్‌ మెగా టోర్నీలో టీమిండియా శుభారంభం చేసింది. శ్రీలంకోని దంబుల్లా వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో విజయ ఢంకా మోగించి టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది.

పాకిస్థాన్‌ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు షెఫాలీవర్మ (40), స్మృతి మంధాన (45) రాణించారు. హేమలత (14) మెరుపులు మెరిపించింది. హర్మన్‌ (5 నాటౌట్‌), రోడ్రిగ్స్‌ (3 నాటౌట్‌)గా నిలిచారు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో 19.2 ఓవర్లలో 108 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. సిద్రా అమీన్ 25, టటూ హసన్‌ 22, ఫాతిమా సనా 22 రన్స్‌ చేయగా.. మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా.. రేణుకా ఠాకూర్‌, పూజా వస్త్రాకర్‌, శ్రేయాంక పాటిల్‌ తలో రెండేసి వికెట్లు తీశారు.

Raju

Raju

Writer
    Next Story