పసికూన చేతిలో భారత్ పరాజయం

జింబాబ్వే ప‌ర్య‌ట‌నను భార‌త జ‌ట్టు ఓట‌మితో మొద‌లెట్టింది. హారారే స్పోర్ట్స్ క్ల‌బ్‌లో జ‌రిగిన తొలి టీ20లో టీమిండియా చెత్త ఆట‌తో చిత్తుగా ఓడింది.

zim
X

జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓటమి చవిచూసింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 102 పరుగులకు అలౌట్ అయింది. దీంతో 13 పరుగుల తేడాతో పసికూన జింబాబ్వే విజయం సాధించింది. కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 31 పరుగులు చేశాడు. ఆఖర్లో అవేష్ ఖాన్ 16 పరుగులు నమోదు చేశాడు. కెరీర్ లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ (0 డకౌట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ 7, రియాన్ పరాగ్ 2, ధ్రువ్ జురెల్ 7 పరుగులు చేశారు. రింకూ సింగ్ (0) పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. సొంతగ‌డ్డ‌పై తెండాయ్ చ‌త‌ర‌(3/16), కెప్టెన్ సికింద‌ర్ ర‌జా(3/25), లు విజృంభించ‌డంతో భార‌త టాపార్డ‌ర్, మిడిలార్డ‌ర్ చేతులెత్తేయ‌గా.. చివ‌ర్లో వాషింగ్ట‌న్ సుంద‌ర్(27) ఒంట‌రి పోరాటం చేశాడు. చివ‌రి ఓవ‌ర్‌ వ‌ర‌కూ నిల‌బ‌డిన సుంద‌ర్ ఓట‌మిని మాత్రం త‌ప్పించ‌లేక‌పోయాడు. ఈ విజ‌యంతో ఆతిథ్య జ‌ట్టు ఐదు మ్యాచ్‌ల‌ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Vamshi

Vamshi

Writer
    Next Story