బంగ్లాను చిత్తుచేసి ఫైనల్‌కు చేరిన భారత్‌

మహిళల ఆసియాకప్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరుకున్నది. సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.

బంగ్లాను చిత్తుచేసి ఫైనల్‌కు చేరిన భారత్‌
X

మహిళల ఆసియాకప్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరుకున్నది. సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. బంగ్లా జట్టు నిర్దేశించిన 81 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 11 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు షఫాలీ (26), స్మృతి మంధాన (55) రన్స్‌ చేశారు.

టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నది. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 80 రన్స్‌ మాత్రమే చేసింది. ఆ జట్టులో నిగర్‌ సుల్తానా (32), శోర్న అక్తర్ (19 నాటౌట్‌) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే వెనుదిరిగారు. టీమిండియా బౌలర్లలో రేణుక, రాధా మూడేసి వికెట్లు పడగొట్టారు. పూజా, దీప్తి తలో వికెట్‌ తీశారు.

ఇవాళ జరుగుతున్న పాకిస్థాన్‌, శ్రీలంక సెమీస్‌2 మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఫైనల్‌ లో ఆ జట్టుతో భారత్‌ టైటిల్‌ కోసం తలపడుతుంది.

Raju

Raju

Writer
    Next Story