జయహో హర్విందర్‌ సింగ్‌

ధరంబీర్‌ పసిడి త్రో.

జయహో  హర్విందర్‌ సింగ్‌
X

పారిస్‌ పారా అథ్లెట్లు అంచనాలను దాటారు. ఐదు రోజుల వ్యవధిలోనే ఐదు స్వర్ణాలు సహా 24 పతకాలు సాధించారు. నాలుగో రోజే 20 పతకాల మార్కును దాటి మూడేళ్ల కిందట టోక్యోలో 19 పతకాలతో నెలకొల్పిన రికార్డును తిరగరాశారు.ప్రస్తుతం భారత్‌ 5 స్వర్ణాలు, 9 రజతాలు, 10 కాంస్యాలు కలిపి మొత్తంగా 24 పతకాలతో పట్టికలో 13వ స్థానంలో నిలిచింది.

పారాలింపిక్స్‌లోని ఆర్చరీ విభాగంలో హర్విందర్‌ సింగ్‌ అదరగొట్టాడు. టోక్యో పారాలింపిక్స్‌లో కాంస్యానికే పరిమితమైన అతను పారిస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో స్వర్ణం సాధించాడు. పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి ఆర్చర్‌ హర్విందర్‌ సింగ్‌ కావడం గమనార్హం.ఏకపక్షంగా సాగిన ఫైనల్స్‌లో హర్విందర్‌ పోలండ్‌ క్రీడాకారుడు సిస్జెక్‌ లూకాజ్‌పై నెగ్గాడు. సెమీస్‌లోనూ 7-3 తో ఇరాన్‌ ఆటగాడు అరబ్‌ అమేరీ మహ్మద్‌ రెజాను ఓడించాడు. అంతకుముందు హర్విందర్‌ మరో రెండు విజయాలతో క్వార్టర్స్‌కు చేరాడు.

అటు పారాలింపిక్స్‌ పురుషుల క్లబ్‌ త్రో (ఎఫ్‌ 51) లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. దేశానికి స్వర్ణం, రజతం పతకాలు అందించారు. అద్భుతమైన ప్రదర్శనతో ధరంబీర్‌ సింగ్‌ స్వర్ణం చేజిక్కించుకోగా ప్రణవ్‌ రజతం దక్కించుకున్నాడు. ధరంబీర్‌ 34.92 మీటర్ల త్రోతో విజేతగా నిలిచాడు. ప్రణవ్‌ 34.59 మీటర్లతో త్రోతో రెండో స్థానంలో నిలిచాడు. సెర్బియాకు చెందిన దిమిత్రిజెవిచ్‌ జెల్కో (34.18) కాంస్యం గెలుచుకున్నాడు.


Raju

Raju

Writer
    Next Story