అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వండి.. దేశం గర్వించేలా చేయండి: మోడీ

పారిస్‌ ఒలింపిక్స్‌లో దేశం గర్వించేలా 140 కోట్ల మంది ఆకాంక్షలకు అనుగుణంగా సత్తా చాటాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలను అధిగమించాలన్నారు.

అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వండి.. దేశం గర్వించేలా చేయండి: మోడీ
X

పారిస్‌ ఒలింపిక్స్‌లో దేశం గర్వించేలా 140 కోట్ల మంది ఆకాంక్షలకు అనుగుణంగా సత్తా చాటాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణం సహా భారత్‌ 7 పతకాలు సాధించింది. ఈ సంఖ్య మరింత మెరుగుపడాలని భావిస్తున్న ప్రధాని పారిస్‌ వెళ్తున్న అథ్లెట్లలో సమావేశమయ్యారు. భారత అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ద్వారా యావత్‌ దేశం గర్వించేలా చేస్తారని విశ్వసిస్తున్నట్లు ఎక్స్‌లో ప్రధాని పేర్కొన్నారు. వారి జీవితాలు, ప్రయాణాలు 140 కోట్ల మంది భారతీయుల ఆశలుగా చిగురించాయన్నారు.

అథ్లెట్లు, సహాయక సిబ్బంది, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, , క్రీడా మంత్రి మన్‌సుఖ్ మాండవీయ,షూటింగ్ స్పోర్ట్ డైరెక్టర్ పియరీ బ్యూచాంప్‌,ఐవోఏ అధ్యక్షు రాలు పీటీ ఉషలతో కలిసి దిగిన ఫొటోలను ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.ఈ సందర్బంగా పారిస్ లోనూ సత్తా చాటాలని జావెలిన్‌త్రో ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా. బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, పీవీ సింధులతో ప్రధాని వర్చువల్‌గా మాట్లాడారు.

ఈ నెల 26 వ తేదీన ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌ ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. 32 క్రీడలకు సంబంధించిన 329 క్రీడాంశాల్లో 10,500 మందికిపైగా అథ్లెట్లు పోటీ పడనున్నారు.

Raju

Raju

Writer
    Next Story