టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ బాధ్యతలు

టీమిండియా హెడ్‌కోచ్‌గా గంభీర్‌ మైదానంలో అడుగుపెట్టాడు. శ్రీలంకతో పర్యటనలో కోసం భారత జట్టుతో కలిసి వెళ్లిన గంభీర్.. తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. ఆటగాళ్లకు ప్రాక్టీస్‌ను పరిశీలిస్తూ వారికి తగు సూచనలు చేశాడు.

Gutham gamibir
X

భారత హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టారు. శ్రీలంక పర్యటనలో భాగంగా పల్లెకెలెలో ఉన్న జట్టు సభ్యులతో చేరారు. మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న ఆటగాళ్లకు గంభీర్ సూచనలు చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. కోచ్ గా మైదానంలో అడుగుపెట్టిన గంభీర్ ఆటగాళ్ల సాధనను నిశితంగా పరిశీలిస్తూ, వారికి తగిన సూచనలు ఇస్తూ బిజీగా కనిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో అనుభవం ఉన్న గంభీర్... టీమిండియా ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ, వారితో ప్రాక్టీసు చేయించాడు.

ఈ ఏడాది ఐపీఎల్ లో గంభీర్ మెంటార్ గా వ్యవహరించిన కోల్ కతా నైట్ రైడర్స్ తిరుగులేని విజయాలతో సీజన్ చాంపియన్ గా నిలిచింది. దాంతో గౌతీ మార్గదర్శకత్వంపై అందరిలో ఓ విశ్వాసం ఏర్పడింది. ముఖ్యంగా, బీసీసీఐ కార్యదర్శి జై షా పట్టుబట్టి మరీ గంభీర్ ను టీమిండియా కోచ్ గా పనిచేసేందుకు ఒప్పించారు. ఇక, శ్రీలంక పర్యటనలో టీమిండియా మొదట టీ20 సిరీస్, ఆ తర్వాత వన్డే సిరీస్ ఆడనుంది. జులై 27 నుంచి టీ20లు, ఆగస్టు 2 నుంచి వన్డేలు జరగనున్నాయి.

Vamshi

Vamshi

Writer
    Next Story