వినేశ్‌కు నిరాశ.. కాస్‌ తీర్పుపై ఛాలెంజ్‌!

భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు నిరాశే ఎదురైంది. వినేశ్‌కు వ్యతిరేకంగా కాస్‌ తీర్పు వచ్చింది. అయితే దీనిపై ఛాలెంజ్‌ చేసే అవకాశం ఉన్నదని క్రీడా నిపుణులు చెబుతున్నారు.

వినేశ్‌కు నిరాశ.. కాస్‌ తీర్పుపై ఛాలెంజ్‌!
X

భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు నిరాశే ఎదురైంది. తనపై అనర్హత వేటు సవాల్‌ చేస్తూ.. రజత పతకం ఇవ్వాలని కోరిన ఆమె ఫోగాట్‌ అప్పీల్‌ను (కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌) కాస్‌ తిరస్కరించింది. వినేశ్‌కు వ్యతిరేకంగా కాస్‌ తీర్పు వచ్చింది. అయితే దీనిపై ఛాలెంజ్‌ చేసే అవకాశం ఉన్నదా అని అందరూ ఆరా తీస్తున్నారు. అలాంటి ఛాన్స్‌ ఉన్నదని క్రీడా నిపుణులు చెబుతున్నారు.

క్వార్టర్స్‌, సెమీస్ లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్‌కు చేరిన ఫొగాట్‌ నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు అదనంగా ఉన్నదనే కారణంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దీన్ని సవాల్‌ చేస్తూ సంయుక్తంగా తనకు రజత పతకం ఇవ్వాలని వినేశ్‌ కాస్‌ ఆశ్రయించింది. కాస్‌ తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వచ్చింది. దీంతో పతక ఆశలు ఆవిరైన వినేశ్‌కు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతున్నది. దీనిపై భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష ఇప్పటికే స్పందించగా.. కాస్‌ తీర్పుపై వినేశ్‌ కు ఏవోఏ మద్దతు ఉంటుందని ప్రకటించింది. తదుపరి న్యాయపరమైన అవకాశాలపై దృష్టి సారించామని తెలిపింది. అథ్లెట్లకు న్యాయం జరగాలన్నదే మా అభిమతమని, వారి హక్కుల కోసం చివరి వరకు పోరాడుతామని ఐవోఏ వెల్లడించింది.

కాస్‌ తీర్పుపై భారత రెజ్లర్‌ భజరంగ్‌ స్పందిస్తూ.. చీకట్లో నీ పతకం కొట్టేశారు. అయితే డైమండ్‌లలా నువ్వు ప్రపచంమంతటా వెలుగిపోతున్నావు. దేశ కోహినూర్‌ వజ్రానివి. ఎక్కడ చూసినా నీ పేరు తలుస్తున్నారు. ఎవరికైతే పతకాలు కావాలని అనుకుంటున్నారో... వారంతా రూ. 15 లెక్కన కొనుక్కోండి' అని పోస్ట్‌ పెట్టాడు.

Raju

Raju

Writer
    Next Story