ప్రతీ క్రీడాకారుడికి అభినందనలు: ప్రధాని

భారత్‌ కోసం క్రీడల్లో పాల్గొన్న ప్రతీ క్రీడాకారుడికి అభినందనలు చెప్పడానికి ఇంతకు మించిన మంచి తరుణం మరొకటి ఉండన్న మోడీ

ప్రతీ క్రీడాకారుడికి అభినందనలు: ప్రధాని
X

జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. మేజర్‌ ధ్యాన్‌చంద్‌కు నివాళులు అర్పించారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వీడియోను ప్రధాని తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. పారిస్‌ ఒలింపిక్స్‌కు వెళ్లిన అథ్లెట్లతో మాట్లాడిన వీడియో అందులో ఉన్నది.

'భారత్‌ కోసం క్రీడల్లో పాల్గొన్న ప్రతీ క్రీడాకారుడికి అభినందనలు చెప్పడానికి ఇంతకు మించిన మంచి తరుణం మరొకటి ఉండదు. మా ప్రభుత్వం క్రీడలకు మద్దతుగా నిలుస్తూ.. యువతకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తమకు ఇష్టమైన క్రీడల్లో రాణించేలా అండగా నిలుస్తాం' అని ప్రధాని వెల్లడించారు.





Raju

Raju

Writer
    Next Story