తల్లి హృదయంతో అలా మాట్లాడింది: నీరజ్‌ చోప్రా

నదీమ్‌ కూడా నా కొడుకు లాంటి వాడేనని మా అమ్మ మనస్ఫూర్తిగా మాట్లాడారు. కానీ అది కొందరికి నచ్చింది. మరికొందరికి అందులోనూ వింతగా అనిపించిందని నీరజ్‌ చోప్రా తెలిపారు.

తల్లి హృదయంతో అలా మాట్లాడింది: నీరజ్‌ చోప్రా
X

పారిస్‌ ఒలింపిక్స్‌ జావెలిన్ త్రో విభాగంలో భారత స్టార్‌ జావెలిన్‌ త్రో ప్లేయర్‌ నీరజ్‌ చోప్రాకు సిల్వర్‌, పాక్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌ స్వర్ణం గెలిచాడు. ఈ నేపథ్యంలో స్వర్ణం గెలిచిన నదీమ్‌ కూడా నా కొడుకులాంటివాడేనని నీరజ్‌ చోప్రా తల్లి సరోజ్‌ వ్యాఖ్యలపై భిన్న స్పందనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత నీరజ్‌ చోప్రా వివరణ ఇచ్చారు. మా అమ్మ గ్రామంలో ఉంటుంది. గ్రామీణ ప్రాంత వాసి. టీవీల్లో, సోషల్‌ మీడియాలో వచ్చే భారత్‌-పాకిస్థాన్‌ సంబంధాల గురించి ఆమెకు పెద్దగా తెలియదు. మా అమ్మ తల్లి హృదయంతో అలా మాట్లాడారు. మనస్ఫూర్తిగా మాట్లాడారు. కానీ అది కొందరికి నచ్చింది. మరికొందరికి అందులోనూ వింతగా అనిపించింది. సింపుల్‌గా మాట్లాడటంతోనే ఇలాంటి సమస్య ఎదురైందని చోప్రా వివరణ ఇచ్చాడు.

నదీమ్‌ గురించి నీరజ్‌ తల్లి సరోజ్‌ స్పందించినట్లే నీరజ్‌పై నదీమ్‌ అమ్మకూడా మాట్లాడారు. నీరజ్‌ కూడా నా కొడుకు లాంటివాడే. అతని కోసం ప్రార్థించాను. అతను నదీమ్‌కు మిత్రుడు. అలాగే సోదరుడిలా భావిస్తాడు. ఆటల్లో గెలుపోటములు సహజం. భవిష్యత్తులోనూ నీరజ్‌ మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. నదీమ్‌తో పాటు నీరజ్‌ కోసం ప్రార్థిస్తాను అని ఆమె స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు.

Raju

Raju

Writer
    Next Story