మండలిలో ప్రతిపక్ష నేతగా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో విపక్ష నేతగా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నియమితులయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్లని మండలిలోప్రతిపక్ష నేతగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది.

Mlc appireddy
X

ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ పేరిట నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా అసెంబ్లీలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని ఇప్పటికే మాజీ సీఎం జగన్ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు. మరోవైపు ఏపీ అసెంబ్లీలో వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. ఈ లేఖపై స్పీకర్ ఇంకా తన నిర్ణయాన్ని వెలువరించలేదు.శాసనమండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉండగా.. సభ్యుల పదవీ కాలం ఆరేళ్లుగా ఉంటుంది.

అయితే ప్రతి రెండేళ్లకు 1/3వ వంతు మంది సభ్యుల పదవీకాలం పూర్తవుతూ ఉంటుంది. 58 మంది సభ్యులలో 20 మందిని ఎమ్యెల్యే కోటా కింద ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మరో 20 మందిని స్థానిక సంస్థల కోటా కింద స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు. పట్టభద్రుల కోటా కింద ఐదుగురిని, ఉపాధ్యాయుల కోటా కింద మరో ఐదుగురిని ఎమ్మెల్సీలుగా ఎన్నుకుంటారు. గవర్నర్ కోటా కింద ఎనిమిది మందిని ఎమ్మెల్సీలుగా ఎన్నుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం విపక్ష నేతగా ఎన్నికైన లేళ్ల అప్పిరెడ్డిని సైతం గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. 2027 వరకూ ఆయన పదవీకాలం కొనసాగనుంది.

Vamshi

Vamshi

Writer
    Next Story