రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్న మహిళ మంత్రులు ఎందుకు స్పందించలేదు : సబితా ఇంద్రారెడ్డి

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. వరుసగా జరుగుతున్న సంఘటనలే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు.

Sabitha
X

రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిగినప్పుడు మహిళా మంత్రులు ఎక్కడికి వెళ్లారని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రరెడ్డి ప్రశ్నించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు సునీతా లక్ష్మా రెడ్డి ,సత్యవతి రాథోడ్ ,ఎమ్మెల్సీ సురభి వాణి దేవితో కలిసి మాట్లాడారు. మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖలపై ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ప్రసంగం లో పొరపాటు దొర్లితే హుందాగా క్షమాపణ చెప్పారు. కేటీఆర్ తీరును మహిళా లోకం స్వాగతిస్తోంది .కేటీఆర్ క్షమాపణ చెప్పినా కొందరు కాంగ్రెస్ మహిళా నేతలు ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారని సబితా ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఎనిమిది నెలలుగా మహిళలపై 1800 అత్యాచారాలు జరిగాయి ..రేప్‌లు మర్డర్లు నిత్యకృత్యంగా మారాయి. మహిళలపై ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నా స్పందించని మహిళా కమిషన్ కేటీఆర్ పొరపాటున మాట్లాడిన మాటలపై అంత వేగంగా ఎలా స్పందిస్తుందా ఆమె ప్రశ్నించారు. మమ్మల్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ,డిప్యూటీ సీఎం అనకూడని మాటలు అంటే ఈ మహిళా కమిషన్ ,మంత్రులు ఎక్కడికి వెళ్లారని నిలదీశారు. కేటీఆర్‌కు మాజీ మంత్రి కేసీఆర్ సంస్కారము నేర్పారు కాబట్టే ఆయన క్షమాపణ చెప్పారు మరి సీఎంకు ఎవరు సంస్కారం నేర్పినట్టు లేదన్నారు ..అందుకే క్షమాపణ చెప్పలేదు నాలుగున్నర గంటలు మేము అసెంబ్లీలో నిలబడితే కూడా సీఎం క్షమాపణ చెప్పలేదు ..కనీసం మైక్ ఇవ్వలేదు .ఇదేనా మహిళల పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌కు అభిమానం.. మహిళా మంత్రులు సమాధానం చెప్పాలని సబితా అన్నారు.

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న మలక్ పేటలో అంధ విద్యార్థి మీద అత్యాచారం జరిగిన సంఘటనపై ఆ ఇద్దరు మహిళా మంత్రులు ఎందుకు స్పందించ లేదని సబిత ప్రశ్నించారు. ఓ మహిళా ప్రయాణికురాలిపై బస్సు డ్రైవర్ అత్యాచారం చేశాడు. విచారణ పేరుతో ఓ దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు ఒక్కరు కూడా మాట్లాడలేదని ఆమె అన్నారు. పెద్దపల్లిలో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగిన సమయంలో ఈ మహిళా మంత్రులు నోరుమెదపలేదని సబిత అన్నారు. వీటన్నింటిపై మహిళా మంత్రులుగా ఉన్న వారు ఎందుకు స్పందించలేదని అన్నారు. కేవలం రాజకీయం చేయడం కోసమే కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్నారని సబిత అన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story