అమాత్యునికి తెలియకుండనే ఉత్తర్వులు

తెలంగాణ ప్రాజెక్టుల మీద వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన వారికి సలహాదారు పదవి!

Minister Uttam
X

మేడిగడ్డ పర్యటనలో ఉన్న మంత్రి ఉత్తమ్‌కుమార్ ‌రెడ్డి ప్రభుత్వం నుంచి వచ్చిన జీవో చూసి షాక్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ను నీటిపారుదల & నీటి వనరుల శాఖ సలహాదారుగా నియమించినట్టు ప్రభుత్వం నుండి జీవో వొచ్చింది. ఆ జీవో విషయం పై మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ "ఇది షాకింగ్ న్యూస్ అసలు, నాకు సమాచారం ఇవ్వకుండా, నాతో మాట్లాడకుండా ఎలా ఆర్డర్లు ఇస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది నా శాఖలో" అని అసహనం వ్యక్తం చేశారు మంత్రి.

తెలంగాణ ఇరిగేష‌న్ డిపార్ట్‌మెంట్‌కు ఈ రాష్ట్రంలోని ప్రాజెక్టుల‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసిన వ్య‌క్తిని ఎలా అడ్వైజ‌ర్‌గా నియ‌మిస్తారో ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పి తీరాలని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు.. సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిగా ఆదిత్య‌నాథ్ దాస్‌పై వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రికి వ్య‌తిరేక‌త లేదు కాని. ఆయ‌న స‌ర్వీస్‌లో ఉన్న‌ప్పుడు తెలంగాణ ప్రాజెక్టుల ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరుపై మాత్రం తీవ్ర అభ్యంత‌రాలు, ఆక్షేప‌ణ‌లు ఉన్నాయి. అంతేకాదు శ్రీ‌శైలంతో పాటు తెలంగాణలోని హైడ్రో ఎల‌క్ట్రిక్ ప్రాజెక్టుల్లో క‌రెంట్ ఉత్ప‌త్తిపై అభ్యంత‌రాలు తెలుపుతూ సుప్రీం కోర్టులో ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పున పిటిష‌న్ దాఖ‌లు చేసింది కూడా ఆదిత్య‌నాథ్ దాసే.. తెలంగాణ‌లోని అనేక ప్రాజెక్టుల‌పై కేసులు వేసింది.. తెలంగాణ ప్రాజెక్టుల‌ను నిలిపివేయించాల‌ని అనేక కంప్లైంట్లు చేసింది కూడా ఆయ‌నే.

Vamshi

Vamshi

Writer
    Next Story