విద్యుత్ బిల్లుల డిస్కం అదానీకి ఇవ్వడానికి.. ఓల్డ్ సిటీనే ఎందుకు సెలెక్ట్ చేశారు : అక్బరుద్దీన్

విద్యుత్ బిల్లుల డిస్కం అదానీకి ఇవ్వడానికి పైలెట్ ప్రాజెక్టు కింద పాతబస్తీనే ఎందుకు సెలెక్ట్ చేశారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.

Akabar
X

కరెంట్ బిల్లుల వసూలు ప్రైవేటీకరణలో అదానీకి ఇవ్వడానికి పైలెట్ ప్రాజెక్టు కింద పాతబస్తీనే ఎందుకు సెలెక్ట్ చేశారని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. కొడంగల్‌లో కానీ మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీదర్ బాబు నియోజకవర్గాల్లో పెట్టొచ్చు కదా అని ఓవైసీ నిలదీశారు.తెలంగాణ బడ్జెట్‌పై చర్చలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి హామీలు ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు.

అప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్న, ఏమైనా సరే ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయాల్సిందేనన్నారు. ఓల్డ్ సిటీ కూడా హైదరాబాద్ లోని భాగమేనన్నారు. పాతబస్తీ ప్రాంతానికి మెట్రో రైలును విస్తరించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌ మెట్రో కావాలని తానే డిమాండ్ చేసినట్లు గుర్తుచేశారు. దీని కోసం ఆనాడు ముఖ్యమంత్రితో కలిసి ఢిల్లీకి వెళ్లినట్లు తెలిపారు. చివరకు పోరాడి తీసుకొచ్చామని.. కానీ నా ప్రాంతంలోనే ఇప్పుడు మెట్రో సేవలు లేవని,. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story