రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎంపికపై ప్రభుత్వ జాప్యం ఎందుకు : హరీశ్‌రావు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసి 38 రోజులు అవుతున్నా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎంపికపై ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

Harish
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసి 38 రోజులు అవుతున్నా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎంపికపై ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ,ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ,ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేత వేణుగోపాల్ పీఏసీ చైర్మన్ గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు.. కాని అక్కడ ఒక రూల్ ..తెలంగాణలో మరో రూలా హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరుగుగుతున్నారు ..

ఆ రాజ్యాంగం తెలంగాణకు వర్తించదా మాజీ మంత్రి ప్రశ్నించారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్సీ మధుసూధనాచారి పేరు ఇచ్చి 40 రోజులు అవుతోందిదాని ఎందుకు నిర్ణయం తీసుకులేదన్నారు. ఈ ఆలస్యాలకు కారణం ఏమిటీ ? శాసన సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ,పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ ,ఎస్టిమేట్ కమిటీ ,మండలిలో ప్రతిపక్ష నేత నియామకాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని శ్రీధర్ బాబును కోరుతున్నామని హరీశ్‌రావు అన్నారు. ఈ విషయంపై రాహుల్ గాంధీకి ట్వీట్ కూడా చేస్తామని పేర్కొన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story