వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నా : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాన‌ని బీఆర్ఎస్ నాయ‌కులు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు

RS Praveen kumar
X

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని బీఆర్‌ఎస్ నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా అణగారిన వర్గాలకు పేద కులాలకు ఈ చరిత్రాత్మక తీర్పు వల్ల ఇప్పుడైనా కొంత న్యాయం జరుగుతుందని ఆశిద్దామని ఆర్‌ఎస్పీ ఎక్స్ ద్వారా తెలిపారు.

ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లను ప్రవేశపెడితేనే వెనుక బడిన వర్గాలకు సంపూర్ణ అభివృద్ది సాధ్యమన్నారు. దక్షిణ భారత దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయాన్ని తెర మీదికి తీసుకొచ్చి మూడు దశాబ్దాలగా అలుపెరగని పోరాటాన్ని నిర్మించిన కృష్ణ మాదిగకి, మిగతా ఉద్యమకారులందరికీ, ఈ అంశాన్ని సమర్థించిన అన్ని రాజకీయ పార్టీలకు అభినందనలు అని ప్రవీణ్ కుమార్ ట్వీట్‌ ద్వారా తెలిపారు.

Vamshi

Vamshi

Writer
    Next Story