కోర్టు ఆదేశాలతో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తా : కౌశిక్‌రెడ్డి

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెకుల పంపిణీలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది.

Kaushaik
X

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ రగడ నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్య సవాళ్ళు ప్రతి సవాళ్ళతో పొలిటికల్ దుమారం రేపుతోంది. దీనిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనివ్వటం లేదాన్నారు. దీనిపై కోర్టు లో పిటిషన్ దాఖలు చేశామని కోర్టుకు ఆదేశాలు ఇచ్చిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పంపిణీ చేయవచ్చని ఆదేశాలు ఇచ్చిందని కౌశిక్‌రెడ్డి వెల్లడించారు. ఆ జీవో కంపల్సరీగా ఫాలో కావాల్సిందే అని కోర్టు చెప్పిందని పెర్కొన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో పొన్నం ప్రభాకర్ నన్ను అడ్డుకుంటున్నారని..రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఏ విధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నారు. ఏ హోదాలో ఆయన పంపిణీ చేస్తున్నారో చెెప్పాలని కౌశిక్‌ ప్రశ్నించారు. మీరు గెలిచినట్టే మేము కూడా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళమే.ఇవాళ మమల్ని ఇబ్బంది పెడుతున్నారు..రేపు మేము అధికారం లోకి వచ్చాక చూపిస్తామన్నారు. నన్ను ఇబ్బంది పెట్టండి కానీ, హుజురాబాద్ ప్రజలని ఇబ్బంది పెట్టొద్దన్నారు .పార్టీ మారిన వాళ్ళకి మానవత్వం లేదన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి మారటం లేదని క్లారీటీ ఇచ్చింది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు చెకులను పంపిణీ చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. చెక్కుల పంపిణీకి కోర్టు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది.

Vamshi

Vamshi

Writer
    Next Story