ప్రతిపేదవాడికి ఇల్లు కట్టిస్తాం.. అసెంబ్లీలో భ‌ట్టి కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో ప్రతిపేదవాడికి ఇల్లు కట్టిస్తాం అని అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ పేర్కొన్నారు.

bahtti
X

తెలంగాణ బడ్జెట్‌పై శాసనసభలో ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ ప్రసంగించారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. ప్రతి గ్యారంటీనీ అమలు చేసేందుకు తపిస్తున్న ప్రభుత్వం మాది. ప్రభుత్వంలోని ప్రతి మంత్రి ఉదయం నుంచి సాయంత్రం వరకూ వారివారి కార్యలయాల్లో సమీక్షలు నిర్వహిస్తూ.. పనిచేస్తున్నారు. అలాగే గ్యాస్ సిలండర్ ను రూ. 500కే అందిస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అని భ‌ట్టి విక్ర‌మార్క‌ స్పష్టం చేసారు.

రాష్ట్రంలో ప్రతిపేదవాడికి ఇల్లు కట్టిస్తామని భట్టి తెలిపారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. రేషన్ కార్డులపై క్యాబినెట్ సబ్ కమిటీ వేశాం.. విధివిధానలు రూపొందిస్తాం అని ఆయన అన్నారు.ఐటీఐలను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలుగా మార్చుతామని అన్నారు. పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఒక అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఉంటుందని స్పష్టం చేశారు. సాగునీటి జలాల సమస్య తీర్చాలనే రాష్ట్రం తెచ్చుకున్నామని వివరించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story