చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ట్రాఫిక్ జామ్

మంగళగిరి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

trapice jam
X

చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో విజయవాడ-గన్నవరం రహదారి రద్దీగా మారింది. కేసరపల్లి సభా ప్రాంగణం వద్దకు ఉదయాన్నే వేలాదిగా కూటమి కార్యకర్తలు పోటేత్తారు. అభిమానులు సైతం పెద్ద ఎత్తున తరలిరావటంతో కనకదుర్గ వారధిపై కిలోమీటర్ల మేర వందలాది వాహనలు నిలిచిపోయాయి. వారిధిపైన చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు వైపు నుంచి వస్తున్న వెకిల్స్ స్తంభించిపోయాయి. కాజా టోల్‌ప్లాజా వద్ద 5 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు.

చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా దేశవ్యాప్తంగా ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి సమీపంలోని హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ముఖ్యనేతలు తరలివస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి కృష్ణా జిల్లాలోని కేసరపల్లిలో ఏర్పాట్లు చేయగా అన్ని జిల్లాల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వస్తున్నారు. దీంతో కృష్ణా జిల్లా వైపుగా రాయలసీమ నుంచి వచ్చే వాహనాలు 5కిలోమీటర్ల మేర నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Vamshi

Vamshi

Writer
    Next Story