మేం పార్టీ మారలే.. మీరే గెంటేసిండ్రు ; సునీతా లక్ష్మారెడ్డి

తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.

Sunitha reddy laxman reddy
X

తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపట్ల కన్నీటి పర్యంతయ్యారు. తామేం తప్పు చేయలేదని.. పార్టీ మారారు అనే హక్కు మీకు లేదని వారు పేర్కొన్నారు. అసలు తాను పార్టీ మారలేదని.. మీరే మెడ పట్టి బయటకు గెంటేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయాల్లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చారని తెలిపారు.

మహిళలను రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారని చెప్పారు. ప్రస్తుతం మహిళలను కనీసం మాట్లాడనివ్వడం లేదు. ముఖ్యమంత్రి సీటు రేవంత్ రెడ్డి సొంతం కాదు.. నాలుగు కోట్ల ప్రజలు ఇచ్చిన పదవి అని అన్నారు. తాము ఏ పార్టీలో ఉన్నా.. కమిట్మెంట్‌తో పనిచేశామని సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. జెండా మోసిన కార్యకర్తలను కాపాడుకున్నామని అన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి తీరు దొంగలే దొంగ అన్నట్లుగా ఉందని చెప్పారు. డీకే అరుణ, సబితారెడ్డితో పాటు రేవంత్ రెడ్డి తనను కూడా అవమానించారని సునీతా లక్ష్మారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.

Vamshi

Vamshi

Writer
    Next Story