ఢిల్లీ లిక్కర్‌ కేసు రాజకీయ ప్రేరేపితమైంది

కవిత ఎప్పటికీ జైళ్లోనే ఉండాలని కాంగ్రెస్‌, బీజేపీ అనుకుంటున్నాయా : తలసాని

ఢిల్లీ లిక్కర్‌ కేసు రాజకీయ ప్రేరేపితమైంది
X

ఢిల్లీ లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపితమైనదని.. ఈ విషయం తాము మొదటి నుంచి చెప్తున్నామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ప్రజలకు ఈ కేసుపై ఇప్పటికే ఒక స్పష్టత వచ్చిందన్నారు. కవితకు బెయిల్‌ రావడంపై పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాయని తెలిపారు. ఏదైన కేసులో అప్రూవర్స్‌ అంటే ఒకరో, ఇద్దరో ఉంటారని.. ఈ కేసులో 11 మంది అప్రూవర్లుగా మారారని తెలిపారు. ఆరోపణలు చేయడం తప్ప ఒక్క పైసా రివకరీ చేయలేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పును ప్రశ్నించేలా బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని, సుప్రీం కోర్టు జడ్జీలను కించపరిచేలా వాళ్ల వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఈ కేసులో ఇప్పటికే చాలా మందికి బెయిల్‌ ఇచ్చారని, కవితకు బెయిల్‌ ఇవ్వడంలో ఆ రెండు పార్టీల నేతలకు అభ్యంతరాలు ఏమిటని ప్రశ్నించారు. బెయిల్‌ అడగడం ఆమె హక్కు అన్నారు. ఎప్పటికీ ఈ కేసులో కవిత జైళ్లోనే ఉండాలని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయా అని ప్రశ్నించారు. కవిత సాయంత్రం జైలు నుంచి విడులవుతారని.. రేపు మధ్యాహ్నం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి తన నివాసానికి చేరుకుంటారని మంత్రి తెలిపారు.

Next Story