అమిత్‌షాపై ఓల్డ్ సిటీలో కేసు ఉపసంహరణ..చీకటి ఒప్పందం బయటపడింది

మరోసారి కాంగ్రెస్- బీజేపీ చీకటి ఒప్పందం బయటపడిందని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది

Amith shash
X

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత కేంద్ర మంత్రి అమిత్‌షా మీద నమోదైన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసును ఉపసంహరించుకున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య అక్రమ సంబంధం మళ్లీ బయటపడిందని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. మొన్న సింగరేణి బొగ్గు గనుల వేలంకు బీజేపీ మద్దతు తెలపడం ఇప్పుడు కేసు కొట్టివేయడం ఇలా కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ట్వీట్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ గెలిచే విధంగా కొన్ని చోట్ల డమ్మీ క్యాండెట్ పోటీ పెట్టారని పేర్కొన్నారు.

హైదారాబాద్ పాత బస్తీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడ్ ఉల్లంఘించారని ఆరోపణతో కేసు నమోదు. అమిత్‌షా,కిషన్ రెడ్డిపై కేసు నమోదు అయింది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ తమ చీకటి పొత్తును కొనసాగిస్తూనే ఉందని విమర్శించింది. మొన్న సింగరేణి బొగ్గు గనులు వేలంకు బీజేపీకి మద్దతు, రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న అరాచక పాలనను ప్రశ్నించకుండా మౌనం వహిస్తోందని, ఇప్పుడు కేసు కొట్టివేత జరిగిందని బీఆర్ఎస్ తెలిపింది. ఇలా కాంగ్రెస్, బీజేపీ ఒకరికొకరు సహకరించుకుంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో మళ్ళీ బయటపడ్డ కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధం అంటూ బీఆర్ఎస్ ట్వీట్ చేసింది.

Vamshi

Vamshi

Writer
    Next Story