తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా.. మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్‌

తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభం కానుంది. 12 గంటలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా.. మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్‌
X

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్ధికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పద్దులో తెలంగాణకు అన్యాయంపై ఇవాళ సభలో చర్చించారు. ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయడానికి సిద్దంగా ఉన్నమని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. దీనికి తాము కుడా సహకరిస్తామని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ స్పష్టం చేసింది. అన్ని పార్టీల నేతలు ఈ తీర్మానంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

బీఆర్‌ఎస్‌ తరఫున పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో మాట్లాడారు. తీర్మానానికి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. రేపు మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. తర్వాత బడ్జెట్‌పై చర్చ జరగనుంది. రేపు సీఎం రేవంత్‌ రెడ్డి బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇచ్చే అవకాశం ఉంది.

Vamshi

Vamshi

Writer
    Next Story