తెలుగులో ప్రమాణం చేసిన తమిళ ఎంపీ... అసదుద్దీన్ ప్రమాణం దుమారం

తెలంగాణకు చెందిన ఎంపీలు ఈరోజు లోక్ సభలో ప్రమాణం చేశారు. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఒవైసీ ప్రమాణ స్వీకారం సభలో దుమారం రేపింది.

krishanppa
X

దేశంలో తెలుగు ఖ్యాతి మరింత విస్తరిస్తోంది. తమిళనాడులోని కృష్ణగిరి కాంగ్రెస్ ఎంపీ గోపినాథ్ లోక్‌సభలో తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌లో ఎంపీల ప్రమాణ స్వీకారం రెండోరోజు కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణం చేయిస్తున్నారు. పలువురు ఎంపీలు తమ తమ మాతృభాషల్లో ప్రమాణం చేస్తున్నారు. అయితే కృష్ణగిరి ఎంపీ తెలుగులో ప్రమాణం చేశారు. కృష్ణగిరి ఏపీని అనుకొని ఉంటుంది. ఇక్కడ తమిళుల తర్వాత అత్యధికంగా తెలుగు వారు, ఆ తర్వాత కన్నడవారు ఉంటారు. తమిళనాడులో ఉన్నందున తమిళ ప్రజలతో వారి భాషలోనే మాట్లాడుతారు.

తెలుగు భాషపై ఎక్కువ ఆసక్తికలిగిన ఆయన గతంలో (2001, 2006, 2011) ఎమ్మెల్యేగా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు తొలిసారి కృష్ణగిరి నుంచి ఎంపీగా గెలవడంతో తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకుని ముందుగానే సెక్రటరీ జనరల్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన కోరిక మేరకు తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం సభలో దుమారం రేపింది. ఆయన ప్రమాణంపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది.

అసదుద్దీన్ ప్రమాణం చేసిన తర్వాత చివరలో జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని నినాదాలు చేశారు. ఈ నినాదాలపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలుగులో ప్రమాణం చేశారు. ప్రమాణం చివరలో కావ్య జై భీమ్, జై భద్రకాళి, సేవ్ కానిస్టిట్యూషన్ అని నానాదాలు చేశారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. చివరలో జై హింద్, జై తెలంగాణ, జై సంవిధాన్ అని నినదించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story