ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు : కేటీఆర్

వాగ్దానాలను గాలికొదిలిన..వంచనల బడ్జెట్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌ ద్వారా ప్రశ్నించారు

KTR
X

శాసన సభలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజలను వంచనకు గురి చేసేలా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల..ఎగవేతల బడ్జెట్ అని పేర్కొన్నారు. అవ్వాతాతలకు..దివ్యాంగులకు.. నిరుపేదలకు...నిస్సహాయులకు మొండిచేయి..! పెన్షన్ల పెంపు మాటెత్తలేదన్నారు. దళితులకు దగా..గిరిజనులకు మోసం అంబేద్కర్ అభయహస్తం ఊసులేదు..శూన్యహస్తమే మిగిలిందన్నారు. . ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో సైతం ఒక్క రూపాయి తేలేని అసమర్ధ దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని ఘాటుగా విమర్శించారు.

ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో వీరి ప్రజా వ్యతిరేక విధానాలని ఎక్కడికక్కడ ఎండ గడతారని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకులని ఊర్లో తిరిగే పరిస్థితి లేకుండా చేస్తారన్నారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు..4 వేల భృతి జాడా పత్తా లేదు..!విద్యార్థులపై కూడా వివక్షే..5 లక్షల భరోసా కార్డు ముచ్చట లేదు..! హైదరాబాద్ అభివృధిపై శ్రద్ధలేదు..మహానగర మౌలిక వసతులకు నిధుల్లేవ్..! మొత్తంగా ..పసలేని..దిశలేని..దండగమారి బడ్జెట్ అని కేటీఆర్ ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story