మాజీ ఎమ్మెల్యేలు రేగా, బానోత్ హరిప్రియ అరెస్ట్

బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, బానోత్ హరిప్రియను అరెస్ట్‌ అయ్యారు.

BRS Mlas
X

బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, బానోత్ హరిప్రియను పోలీసులు ముందుస్తు అరెస్ట్ చేశారు. సీతారామ ప్రాజెక్టుల ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. అశ్వాపురం బిజి కొత్తూరుకు మంత్రుల వస్తున్న నేపథ్యంలో14 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి పర్యటన నేపధ్యంలో సోషల్ మీడియా వేదికగా మాజీ ఎమ్మెల్యే రేగా జిల్లాకు సీతారామ ద్వారా సాగు నీరు ఇస్తానని ముఖ్యమంత్రి ప్రకటించక పోతే సీఎం పర్యటను అడ్డుకుంటామని హెచ్చరించారు.

పినపాక నియోజకవర్గానికి సాగునీలిచ్చే మారెల్లిపాడు ట్యాంక్ పనులు ఎందుకు ఆపినట్లు అని ప్రశ్నించారు. భద్రాద్రి జిల్లాకు సాగునీళ్ళు ఇవ్వకుండా పక్క జిల్లాకు తీసుకుపోతున్నందుకు జిల్లా రైతాంగానికి భేషరతుగా సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇక వైరా మండల కేంద్రంలో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story