జైనూరు బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి

వీహెచ్‌పీ నాయకుల డిమాండ్‌

జైనూరు బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి
X

కొమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరు బాధితురాలికి ప్రభుత్వం కార్పొరేట్‌ హాస్పిటల్‌ లో వైద్యం అందించానలి విశ్వహిందూ పరిషత్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం నగరంలోని వీహెచ్‌పీ ఆఫీస్‌ లో జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్‌, రాష్ట్ర ప్రచార ప్రముఖ్‌ పగడాల బాలస్వామి, ఉపాధ్యక్షులు సునీత రామ్మోహన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గిరిజన మహిళపై అత్యాచారయత్నం, హత్యాయత్నం జరిగితే కొందరు ఓట్ల రాజకీయాలు చేయడం సిగ్గు చేటు అన్నారు. చట్ట వ్యతిరేకంగా గిరిజన ఆవాస ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అక్కడి నుంచి తరిమేయాలన్నారు. ఈ ఘటన తర్వాత జైనూరు తగలబడుతున్నా పోలీస్‌ యంత్రాంగం నిందితులకే వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని నిందితులను శిక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో నాయకులు జగదీశ్వర్, రేగు అనిల్ పాల్గొన్నారు.

Next Story